ఈ మధ్య కాలంలో AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వాడకం భారీ గా పెరిగి పోయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే కొంత మంది AI టెక్నాలజీని వాడి సోషల్ మీడియాలో కొంత మంది కి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను AI టెక్నాలజీ ద్వారా జనరేట్ చేసి వాటిని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడం జరుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు తమ ఫోటోలను AI టెక్నాలజీ ద్వారా డెవలప్ చేసి వాటిని సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు అని కోర్టును ఆశ్రయించిన వారు ఉన్నారు. అందులో భాగంగా కోర్టు నుండి వారికి సానుకూలంగా తీర్పులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా AI టెక్నాలజీ ద్వారా తమ ఫోటోలను మిస్ యూస్ చేసి చేస్తున్నారు అని , అలా మిస్ యూస్ చేస్తున్న వారి అకౌంట్ల నుండి తమ ఫోటోలను డిలీట్ చేయాలి అని ఈ ఇద్దరు నటులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఢిల్లీ హైకోర్టు లో తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. ఇక ఫేస్ బుక్ వారిని మీరు పవన్ కళ్యాణ్ , తారక్ లకు సంబంధించిన ఫోటోలను మీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుండి తొలగించారా అని ప్రశ్నించింది. దానికి ఫేస్ బుక్ సంస్థ వారు లేదు మరి కొన్ని రోజుల్లోనే తొలగిస్తాము అని చెప్పుకొచ్చింది. ఇకపోతే మరి కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ మరియు తారక్ లకి సంబంధించి AI టెక్నాలజీ ద్వారా జనరేట్ చేసి మిస్ యూస్ చేస్తున్న ఫోటోలను ఫేస్ బుక్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్ నుండి పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: