హీరో, టివీకే పార్టీ అధినేత విజయ్ ఒకవైపు రాజకీయాలలో పాల్గొంటూ,మరొకవైపు తను నటిస్తున్న జననాయగన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయకగా నటించగా, మమతా బైజు కీలకమైన పాత్రలో పోషించారు. ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2026 జనవరి 9వ తేదీన విడుదల కావడానికి సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను మరింత పెంచేశాయి. విజయ్ నటిస్తున్న చివరి సినిమా ఇదే.



తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. జననాయగన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా చిత్రీకరించినట్లు సమాచారం. ఈనెల 27(ఈ రోజు) భారీ ఎత్తున చెన్నైలో కాకుండా మలేషియాలో  భారీ ఎత్తున ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చెన్నై నుంచి పలువురు సిని ప్రముఖులు రాబోతున్నట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా డైరెక్టర్ అట్లీ ,నెల్సన్ డైరెక్టర్లు మలేషియాకు వెళ్లారు. అలాగే నటుడు విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, బంధువులతో పాటు మరి కొంతమంది ప్రత్యేక విమానాలలో మలేషియాకి చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత కుమారుడు జెసన్ సంజయ్, కూతురు  కూడా మలేషియాకు వెళ్లినట్లు సమాచారం. మరి వీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా విజయ్, భార్య సంగీత మధ్య విభేదాలు ఉన్నట్టుగా  వార్తలు అయితే కోలీవుడ్లో వినిపిస్తున్నాయి.. ఒకవేళ సంగీత, కొడుకు, కూతురు ఈ సినిమా ఆడియో ఆవిష్కరణలో పాల్గొంటే మాత్రం ఇప్పటివరకు వచ్చిన ప్రచారానికి తెరదించినట్టే అవుతుంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: