రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు ఐబొమ్మ నిర్వహకుడు రవి. సినిమాలను పైరసీ చేస్తూ ఆన్లైన్లో విడుదల చేస్తున్న ఐబొమ్మ రవి పోలీసులకు తనని పట్టుకోండి అంటు సవాల్ విసిరారు. అయితే ఎట్టకేలకు రవిని పోలీసులు సైతం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం కొన్ని కొత్త విషయాలు కూడా బయట పడుతున్న ఇప్పుడు తాజాగా రవి కేసులో ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇమ్మడి రవి వద్ద మరొక వ్యక్తి నకిలీ గుర్తింపు కార్డులో ఉన్నట్లుగా పోలీసులు సైతం గుర్తించారు.


ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తికి సంబంధించి రవి ఫేక్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులు ఉపయోగిస్తున్నట్లు పోలీసుల సైతం గుర్తించారు. రవి మాత్రం అతడు తన ఫ్రెండు అని అప్పట్లో ఇద్దరం కలిసి ఒకే రూమ్ లో ఉండే వారేమని అందుకే ఆ పేరుతో తాను ఆ కార్డులను ఉపయోగిస్తున్నట్లు రవి పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు సైతం ప్రహ్లాద్ గురించి ఆరా తీయగా, బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. అనంతరం హైదరాబాద్ కు పిలిపించి కస్టడీలో ఉన్న రవిని చూపిస్తూ మరి ప్రహ్లాద్ గురించి విచారించగా అసలు విషయం బయటపడింది.


ప్రహ్లాద్ తనకు రవి ఎవరో తెలియదని నా పేరు మీద పాన్ కార్డు ,డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారని తెలిసి తానే షాక్ లో ఉన్నానని పోలీసులకు వివరణ ఇచ్చారు. దీంతో రవి చెప్పిన ఫ్రెండ్ అనేది కేవలం కథలో కల్పితం అని పోలీసులకు అర్థమైంది. కానీ ప్రహ్లాద్ కు సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగలించి వాటి ఆధారంగానే ఇలాంటి ఫేక్ గుర్తింపు కార్డులను సృష్టించి ఉంటారని అనుమానం ఉన్నట్లుగా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈరోజుతో రవి పోలీస్ కస్టడీ కూడా ముగియనుంది. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన రవి పైరసీలో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. విచారణలో భాగంగా తన హార్డ్ డ్రైవ్ లో సుమారుగా 21,000 చిత్రాలు ఉన్నాయని వెబ్సైట్ ద్వారా రూ .20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. అలాగే అతని అకౌంట్లో ఉన్న రూ. 3.5 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: