గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన మూవీలు ఏవి విడుదల అయినా కూడా చాలా టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇలా భారీ టికెట్ ధరలతో సినిమాలను ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రేక్షకులు కూడా భారీ టికెట్ ధరలు ఉంటుండడంతో సినిమాలు చూడడాన్ని చాలా వరకు తగ్గించారు. దానితో కొన్ని చిన్న మూవీ బృందాలు తమ సినిమా టికెట్ ధరలను చాలా వరకు తగ్గించి ప్రేక్షకులకు ముందుకు తీసుకువస్తున్నారు. అలా తక్కువ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిన్న సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇకపోతే స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు మాత్రం అత్యంత భారీ టికెట్ ధరలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు భారీ టికెట్ ధరలు ఉన్నా కూడా వాటికి మంచి కలెక్షన్లు వస్తూ ఉండడంతో స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించిన నిర్మాతలు కూడా భార్య టికెట్ ధరల తోనే ఆ సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకు వస్తున్నారు. ఇకపోతే ఓ స్టార్ హీరో నటించిన సినిమాను మాత్రం అత్యంత తక్కువ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

అది ఏ సినిమా అనుకుంటున్నారా ..? సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సంవత్సరాల క్రితం హీరోగా నటించిన మురారి మురారి. ఈ సినిమాను డిసెంబర్ 31 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ టికెట్ ధరలను రీ రిలీజ్ లో భాగంగా సింగిల్ స్క్రీన్ లలో 99 రూపాయలు గాను , మల్టీప్లెక్స్ లలో 105 రూపాయలు గాను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలా అత్యంత తక్కువ టికెట్ ధరలతో మురారి సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా సోనాలి బింద్రే నటించగా ... కృష్ణ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: