సంక్రాంతి పండుగ ఎంతగా సెలబ్రేషన్స్ చేసుకుంటారో రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగ సినీ ప్రియులకు కూడా ఒక పండుగే. ప్రతి సంక్రాంతికి కూడా చిన్న హీరో పెద్ద హీరోని తేడా లేకుండా సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. అలా ప్రతి ఏడాది కూడా ఎన్నో సినిమాలు విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలు ఉన్నాయి. అలా 2001లో ముగ్గురు స్టార్ హీరోల మధ్య జరిగిన సినిమా వార్లో ఎవరు విజయాన్ని అందుకున్నారో ఇప్పుడు చూద్దాం .


1). నరసింహనాయుడు:
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. ఇందులో సిమ్రాన్ ,ఆశా షైనీ, ప్రీతి జింగానియా నటించారు. జనవరి 11- 2001లో ఈ సినిమా విడుదలయ్యింది. మణిశర్మ అందించిన సంగీతం పాటలు కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా బడ్జెట్ రూ.9 కోట్లు కాగా.. బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టింది. అప్పట్లో 100కు పైగా థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకొని సరికొత్త రికార్డ్ సృష్టించారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ నటనకు గాను బాలకృష్ణకు నంది అవార్డు కూడా అందుకున్నారు. నరసింహనాయుడు సినిమాని తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాకి కథ మాటలు అందించిన పరుచూరి బ్రదర్స్ బాలయ్యతో చెప్పించిన డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. అప్పట్లో లక్స్ పాప సాంగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి.


మృగరాజు:
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2001 సంక్రాంతిల బరిలో విడుదలయ్యింది. ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా తగ్గెక్కించారు. ఇందులో సిమ్రాన్, సంఘవి హీరోయిన్స్ గా నటించగా నాగబాబు ఒక కీలకమైన పాత్రలో నటించారు. సుమారుగా రూ .15 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి కెరియర్ లోని ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ముఖ్యంగా కంటెంట్ పరంగా ఈ చిత్రం అటు అభిమానులను, ఆడియన్స్ ని పెద్దగా నచ్చకపోవడంతో కమర్షియల్ గా  ఆకట్టుకోలేదు. కాని ఈ సినిమా అప్పట్లో మొదటి వారంలో ఆల్ టైం రికార్డు కలెక్షన్స్ ని రాబట్టింది. ఇలా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మృగరాజు సినిమా కృష్ణా జిల్లాలలో రూ. 39 లక్షల రూపాయల షేర్ రెండు వారాల రాబట్టింది. అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ.40 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో రూ .30 లక్షలు రాబట్టి ఆల్ టైం డిస్ట్రిక్ట్ రికార్డులను సృష్టించింది. మొత్తం మీద ఫుల్ రన్ టైం ముగిసేసరికి రూ .14 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ రాబట్టింది.


దేవిపుత్రుడు:
2001లో విడుదలైన సంక్రాంతి చిత్రాలలో వెంకటేష్ నటించిన దేవిపుత్రుడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా సోషియా ఫాంటసీ చిత్రంగా డైరెక్టర్ కోడిరామకృష్ణ తెరకెక్కించారు. వెంకటేష్ ఇందులో ద్విపాత్రాభినయంలో నటించారు. సౌందర్య, అంజలాజావేరి నటించారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారక గురించి ఈ సినిమాని తెరకెక్కించారు. అప్పట్లో అత్యధిక భారీ బడ్జెట్ తో, VFX ఎక్కువగా ఉపయోగించిన సినిమాగా పేరు సంపాదించింది. అయితే కలెక్షన్స్ పరంగా ఆశించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ఈ చిత్రంలోని చైల్డ్ యాక్టర్ గా"వేగ తమోటియా " నటించింది. ఈ చిత్రాన్ని రూ.15 కోట్ల రూపాయలతో తెరకెక్కించగా రూ .14 కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిందని నిర్మాత ఎమ్మెస్ రాజు స్వయంగా తెలియజేశారు. ఈ సినిమా పరాజయం తనని చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. ఇలా 2021లో ముగ్గురు స్టార్ హీరోలు వార్లో  ఫ్యాక్షన్ సినిమాతో బాలకృష్ణ సంక్రాంతి విన్నర్ గా నిలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: