సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలా పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇక 2013 వ సంవత్సరం మాత్రం పెద్దగా ఎక్కువ సినిమాలు విడుదల కాలేదు. 2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా కేవలం రెండు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి. విడుదల అయిన రెండు సినిమాలు కూడా స్టార్ హీరోలవి కావడం విశేషం. ఆ రెండు మూవీలపై కూడా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనడంతో ఈ రెండు మూవీలలో ఏ సినిమా సంక్రాంతికి విన్నర్ గా నిలుస్తుంది అనే ఆసక్తి కూడా ఆ సమయంలో జనాల్లో భారీగా పెరిగింది. మరి 2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఆ రెండు సినిమాలు ఏవి ..? అందులో ఏ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

2013 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ , అమలా పాల్ హీరోయిన్లుగా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన నాయక్ మూవీ మరియు విక్టరీ వెంకటేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా అంజలి , సమంత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో కూడా స్టార్ హీరోలు నటించడంతో ఈ రెండు సినిమాలపై ప్రేక్షకులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ రెండు సినిమాలలో నాయక్ మూవీ కి మంచి టాక్ వచ్చింది. ఇక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కి మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ రెండు సినిమాలతో పోలిస్తే నాయక్ మూవీ కంటే కూడా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ కి ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. దానితో 2013 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: