సినిమా ఇండస్ట్రీ లో ఓ కాంబోలో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయింది అనుకునే సమయం వచ్చాక కొన్ని కారణాలతో ఆ మూవీలు ఆగిపోవడం కూడా మనం చూస్తూనే ఉంటాం. కానీ అద్భుతమైన విజయాలు ఉన్న దర్శకులకు , అద్భుతమైన క్రేజ్ ఉన్నా హీరోల కాంబినేషన్లో మూవీ సెట్ అయినట్లయితే అలాంటి మూవీలు ఆగిపోవడం చాలా తక్కువ శాతం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన ఓ దర్శకుడికి ఏకంగా రెండు సార్లు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు గోపీచంద్ మలినేని. ఈయన దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఈయన అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. 

అందులో చాలా మూవీలు మంచి విజయాలను అందుకోవడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కొంత కాలం క్రితం ఈ దర్శకుడు రవితేజ హీరోగా మైత్రి సంస్థ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అంతా ఓకే అయ్యింది ... ఈ సినిమా మరి కొంత కాలం లోనే స్టార్ట్ కాబోతుంది అనుకునే సమయంలో ఈ మూవీ కి భారీ బడ్జెట్ అవసరం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మూవీ క్యాన్సిల్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ మూవీ కూడా నిజంగానే క్యాన్సల్ అయింది. ఆ తర్వాత గోపీచంద్ మలినేని ,  మైత్రి సంస్థ నిర్మాణం లోనే సన్నీ డ్యూయల్ హీరోగా జాట్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఇక కొంత కాలం క్రితం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఓ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. అంతా ఓకే అయ్యింది అనుకునే లోపు ఈ సినిమాకు భారీ బడ్జెట్ అవసరం అవుతుంది అనే నేపథ్యంలో గోపీచంద్ మలినేని మొదట తయారు చేసుకున్న కథను పక్కన పెట్టి మరో కథను ప్రస్తుతం తయారు చేస్తున్నట్లు, ఆ కథతో ముందు అనుకున్న బడ్జెట్తో పోలిస్తే కాస్త తక్కువ బడ్జెట్లో ఓ సినిమాను రూపొందించనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా గోపీచంద్ మలినేని కి ఈ మధ్య కాలంలో రెండు సినిమాల విషయంలో చేదు అనుభవాలు ఎదురైనట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: