మెగాస్టార్ చిరంజీవి చాలా సంవత్సరాల తర్వాత మన శంకర వర ప్రసాద్ గారు అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించాడు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. సైన్ స్క్రీన్ , గోల్డ్ బాక్స్ బ్యానర్లపై సాహూ గారపాటి , సుష్మిత కొణిదల సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బీమ్స్ సిసిరిలీయో సంగీతం అందించాడు. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి పక్క ఫుల్ లెన్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించడం ... వరుస విజయాలతో అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ఈ రోజు అనగా జనవరి 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో విడుదల చేయనున్నారు అనేది తెలుసుకుందాం.

ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 8 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో మొత్తంగా 300 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు 800 థియేటర్లలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2100 థియేటర్లలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి ప్రదర్శించారు. ఈ మూవీ కి ప్రీమియర్ షో ల ద్వారానే బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా కూడా మొదటి రోజు భారీ ఎత్తున థియేటర్లో విడుదల కాండడంతో ఈ సినిమాకు సూపర్ సాలిడ్ ఓపెనింగ్స్ రావడం పక్కా అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: