తెలుగు సినిమాల్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ ఎవరంటే ఠక్కున వచ్చే గుర్తొచ్చే పేరు సమంత. ఎవరి కెరీర్ లో అయినా ఎన్ని సినిమాలు హిట్టు అని చూసుకోవాలి,, కానీ సమంత విషయంలో ఎన్ని ఫ్లాప్స్ అని వెతుక్కోవాలి. అంతటి హిట్ ట్రాక్ రికార్డు సమంత సొంతం. హీరోయిన్లకు పెళ్లయ్యాక కెరీర్ లో అవకాశాలు తగ్గిపోతాయి. కానీ సమంతం విషయంలో మాత్రం రివర్స్. పెళ్లయ్యాకే రంగస్థలం, మజిలీ, ఓ బేబీ లాంటి హిట్స్ పడ్డాయి. అంటే ఈమె కెరీర్ ఇంకా ఎంత స్వింగ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. తన ఫిట్ నెస్ ను కూడా అదే రేంజ్ లో కాపాడుకుంటుంది కూడా.

 

అలాంటి సమంత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తే..! అభిమానులు తట్టుకోగలరా. కానీ ఈ విషయాన్ని సాక్షాత్తూ సమంతనే రివీల్ చేసింది. ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగిన ఓబేబీ సక్సెస్ మీట్ లో సమంత మాట్లాడుతూ సినిమా విజయంపై సంతోషంగా ఉందని, ఇక సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్టు నందిని రెడ్డితో చెప్పానని స్వయంగా తెలిపింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీంతో సమంత వ్యాఖ్యలపై పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇది నిజమేనా.. సామ్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటుందా.. పిల్లల్ని కనాలనుకుంటుందా.. బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకుంటుందా అని ఇండస్ట్రీ వర్గాలు, సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు.


ఏదైమైనా సమంత సినిమాలు మానేస్తే ఇండస్ట్రీకి ఒక మంచి నటి దూరమైనట్టే. ఎటువంటి క్యారెక్టర్ నైనా తన యాక్టింగ్ స్టిల్స్ తో సినిమా రేంజ్ ను పెంచగల నటి సమంత. ఈ న్యూస్ నిజమైతే ఇండస్ట్రీకి, అభిమానులకు షాక్ లాంటి వార్తే. ఎందుకంటే సామ్ కాల్షీట్లు కోసం నిర్మాతలు, హీరోయిన్ గా తీసుకోవాలనుకునే హీరోలు ఇప్పటికీ ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: