మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఈరోజు రిలీజ్ కాబోతున్నది.  సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈరోజు రిలీజ్ అయ్యే మేకింగ్ వీడియోను బట్టి సినిమా ఎలా ఉండబోతుందో కొంచెం అర్ధం చేసుకోవచ్చు.  సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2 వ తేదీన రిలీజ్ చేయడానికి యూనిట్ రెడీ అవుతున్నది.  


పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రాజీ పడకుండా ఉండాలని షూట్ చేస్తున్నారు.  ఎక్కడా ఎలాంటి తేడాలు రాకుండా చూసుకుంటున్నారు.  ఆగస్టు 14 న మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తుంటే.. ఆగష్టు 15 న మెగాస్టార్ కు సంబంధించిన ఏదైనా మరో న్యూస్ ఉంటుందేమో చూడాలి.  


ఇదిలా ఉంటె, సైరా సినిమాకు పోటీగా అదే రోజున మరో భారీ యాక్షన్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  అదే వార్.  హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా.  ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజ్ చేశారు.  భారీ యాక్షన్ తో ఆకట్టుకుంది.  హృతిక్, టైగర్ ష్రాఫ్ ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు థ్రిల్లింగ్ కు గురిచేశాయి.  


ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.  హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీ సైరాకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నది.  రెండు సినిమాలు దేనికి తగ్గట్టుగా అదే ఉన్నది.  వార్ ట్రైలర్ రావడంతో ఆసక్తి పెరిగింది.  మెగాస్టార్ సైరాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.  ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.  


హృతిక్ రోషన్ సూపర్ 30 సినిమా విజయం సాధించడంతో అయన తిరిగి లైన్లోకి వచ్చారు.  వార్ సినిమాతో పాటు, అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం సినిమాలో కూడా అయన నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలన్పి ఉన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: