బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్  తన సిక్స్ ప్యాక్  బాడీ ని దాదాపు తన  ప్రతి సినిమాలో చూపెడుతుంటాడు. అందుకోసం తను నటించే సినిమాల్లో షర్ట్ లెస్ సన్నివేశాలు ఉండేలా  చూసుకుంటాడు.  ఆయన అభిమానులు కూడా  సల్మాన్ ను అలా చూడడానికే ఇష్టపడుతారు. తాజాగా వారిని మరోసారి థ్రిల్ చేసేందుకు సల్మాన్ రెడీ అవుతున్నాడు.  అందులో భాగంగా  ప్రస్తుతం  సల్మాన్ సూపర్ హిట్ సిరీస్ దబాంగ్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం దబాంగ్ 3 లో నటిస్తున్నాడు.  ఈ చిత్రం యొక్క షూటింగ్ తుది దశకు చేరుకుంది ఇక ఈ చిత్రంలో క్లైమ్యాక్స్ లో వచ్చే  యాక్షన్ సీక్వెన్స్ లో సల్మాన్ ఖాన్ చొక్కా లేకుండా  కనిపించనున్నాడు.ఈ సీక్వెన్స్ లో ప్రతినాయకుడు కిచ్చా సుధీప్ కూడా అలానే కనిపించనున్నాడు.వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు  సినిమాకు హైలెట్  గా నిలుస్తాయని సమాచారం. త్వరలోనే ఈ సీక్వెన్స్ ను చిత్రీకరించనున్నారు. 





ప్రభుదేవా డైరెక్ట్  చేస్తున్న ఈచిత్రంలో  సోనాక్షి సిన్హా  హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్  నటుడు మహేష్ మంజ్రేకర్ చిన్న  కుమార్తె  సయి కీలక పాత్రలో నటిస్తుంది. వీరితో పాటు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సాజిద్ -వాజిద్  సంగీతం అందిస్తున్నఈ చిత్రాన్ని  సల్మాన్ ఖాన్ , అర్బాజ్ ఖాన్  నిర్మిస్తున్నారు. ఇక ఈ సిరీస్ లో వచ్చిన  మొదటి  రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో  ఈ మూడవ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి.  ఈ ఏడాది  డిసెంబర్ 21న ఈ చిత్రం హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: