టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో నారా రోహిత్ ఒకరు. కెరీర్ తొలినాళ్లలో సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, మరికొన్ని సినిమాలతో నారా రోహిత్ విభిన్నమైన సినిమాలకు ఓటేస్తారనే పేరును సంపాదించుకున్నారు. ఈ ఏడాది నారా రోహిత్ కీలక పాత్రలో నటించి విడుదలైన భైరవం సినిమాకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నారా రోహిత్ సోలో హీరోగా నటించిన సుందరకాండ మూవీ నేడు థియేటర్లలో విడుదల కాగా నిన్న ఎంపిక చేసిన థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్లు ప్రదర్శితం అయ్యాయి.

హీరోగా నారా రోహిత్ కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా అయినప్పటికీ  సుందరకాండ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడవడంతో పాటు ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.  వినాయక చవితి పండగ కానుకగా  పెద్దగా పోటీ లేకుండా విడుదలైన  ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కథ:

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేసే సిద్దార్థ్  బాల్యంలోనే  వైష్ణవి (శ్రీదేవి)ని చూసి మనసు పారేసుకుంటాడు.  వైష్ణవిలో చుసిన కొన్ని లక్షణాలు సిద్దార్థ్ ప్రేమలో పడటానికి కారణమవుతాయి.  అయితే కొన్ని రీజన్స్ వల్ల వైష్ణవి దూరం కావడంతో అవే  లక్షణాలు ఉన్న అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు.  ఆ సమయంలో వైష్ణవిలా బిహేవ్ చేసే ఐరా (వృతి వాగన్) సిద్దార్థ్ కు తారసపడింది.  సిద్దార్థ్ ఎంతో  కష్టపడి ఐరాను  పెళ్ళికి ఒప్పిస్తాడు. అయితే  ఆ తర్వాత సిద్దార్థ్ కు ఊహించని ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది.

ఐరాకు వైష్ణవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి?  సిద్దార్థ్ తన ప్రేమ ప్రయాణంలో గెలిచాడా? లేదా?  అనే ప్రశ్నలకు సమాధానమే  ఈ సినిమా.

విశ్లేషణ :

టాలీవుడ్ హీరోలు  పాన్ ఇండియా పేరుతో సినిమాల విషయంలో కత్తి  మీద సాము చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులకు నచ్చే,  తెలుగు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు మాత్రం అరుదుగా వస్తున్నాయి. అలాంటి సినిమాలలో సుందరకాండ ఒకటి.  ఈ ఏడాది విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో సుందరకాండ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంది. సినిమాలో ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక ట్విస్ట్  మాత్రం వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఆ ట్విస్ట్ గురించి  తెలుసుకోకుండా మూవీ చూస్తే మాత్రం మంచి అనుభూతిని ఫీలవుతారని చెప్పవచ్చు.

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఈ సినిమాలో నటించడం ఈ సినిమాకు ప్లస్ అయింది.  సింపుల్ లైన్ ను తీసుకుని అద్భుతమైన కథనంతో  దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఫస్ట్  సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు వేరే లెవెల్ లో ఉంది.   ఫ్యామిలీతో కలిసి  సినిమా చూడాలని  భావించే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఆప్షన్ అవుతుంది.  ఈ సినిమాలో సత్య కామెడీ బాగా పేలింది.

కనిపించిన ప్రతి సన్నివేశంలో సత్య తన కామెడీ టైమింగ్ తో అలరించారు.  భిన్నమైన క్లైమాక్స్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమాతో శ్రీదేవి కూడా తెలుగులో బిజీ  కావడం పక్కా అని చెప్పవచ్చు.  లియోన్ జేమ్స్ మ్యూజిక్, బీజీఎమ్,  నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించే అవకాశాలు అయితే ఉన్నాయి.

రేటింగ్ : 3.5/5.0

మరింత సమాచారం తెలుసుకోండి: