నటీనటులు: అఖిల్ రాజ్, తేజస్వి రావు, చైతన్య జొన్నలగడ్డ, కవితా శ్రీరంగం, అనితా చౌదరి.
సంగీతం: సురేష్ బొబ్బిలి
ప్రొడ్యూసర్: వేణు ఉడుగుల, రాజు మోపిదేవి
రచన దర్శకత్వం: సాయిలు కంపాటి.
కథ: ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లా మధ్యలో ఉండే ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులోనే రాజు ( అఖిల్ రాజ్) బ్యాండ్ మేళం వాయించడంలో చాలా ఫేమస్. ఆ ఊర్లో పెళ్లి వేడుకైనా చావు డప్పు అయినా సరే రాజు బ్యాండ్ మేళం ఉండాల్సిందే.. అలా బ్యాండ్ కొట్టడంలో ఎంతో ఫేమస్ అయినటువంటి రాజు ఆ ఊరిలో ఉండే రాంబాయి ( తేజస్విని రావ్)ని చిన్నతనం నుంచే ఇష్టపడతాడు. ప్రతిరోజు రాంబాయి వెంట పడటం చిలిపి పనులు చేయడం వంటివి చేస్తాడు. అయితే మొదట్లో రాంబాయి ఆయన ప్రేమను అంగీకరించదు. కానీ తర్వాత ఓకే చెబుతుంది. కానీ వీరి ప్రేమ కథలో ప్రధాన విలన్ రాంబాయి తండ్రి వెంకన్న( చైతన్య జొన్నలగడ్డ) అయితే ఈయన తన కూతురుని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి ఇవ్వాలని భావిస్తూ ఉంటాడు. దీంతో రాంబాయిని రాజుతో కలవకుండా చేస్తూ ఉంటాడు. కానీ రాజు మాత్రం ఎలాగైనా సరే రాంబాయిని దక్కించుకోవాలని దానికోసం అడ్డదారి ఎంచుకుంటాడు. ముందుగా రాంబాయిని గర్భవతిని చేస్తే వెంకన్న చచ్చినట్టు తనకిచ్చి పెళ్లి చేస్తాడని అనుకుంటాడు. మరి రాజు రాంబాయిని నిజంగానే ప్రెగ్నెంట్ చేస్తాడా..? రాంబాయిని పెళ్లి చేసుకుంటాడా? వెంకన్న వీరి పెళ్లికి ఒప్పుకుంటాడా? అన్నది సినిమా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది.
సినిమా విషయానికొస్తే:
ఈ సినిమా చాలా సింపుల్ గా కనిపించినా కానీ అద్భుతమైన కథాంశంతో డైరెక్టర్ సాయిలు కంపాటి తెరకెక్కించారు. ముఖ్యంగా పరువు హత్యలు అగ్రవర్ణ కులాల్లోనే కాదు అణగారిన వర్గాల్లో కూడా ఉంటాయనేది కళ్ళకు కట్టినట్టు చూపించడం చెప్పవచ్చు. అయితే ఇందులో హత్య చేయడం ఏమీ ఉండదు కానీ వాళ్ళిద్దరిని విడదీయడానికి ఎలాంటి హింసాత్మక ప్లాన్స్ వేస్తారో చాలా క్లియర్ గా చూపించారు డైరెక్టర్.. రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా టైటిల్ కు క్లైమాక్స్ ఉంటుంది.. అయితే ఈ సినిమాలో ఇంతవరకు ఏ ప్రేమ జంట కూడా ఎదుర్కోనటువంటి దుర్మార్గమైన సీన్స్ ప్రతి ఒక్కరిని కలవరపెడుతుంది. చివరికి వారి దుర్మార్గాన్ని తట్టుకోలేక రాజు అడ్డదారి ఎంచుకొని మరీ తనని ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలనుకుంటాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమను ఒప్పుకోవాలంటే తప్పకుండా అమ్మాయికి ప్రెగ్నెంట్ చేయాల్సిందే అని అమాయకంగా నమ్ముతారు ఆ ప్రేమ జంట. ఈ కథలో హీరోయిన్ అటు ప్రేమించిన అబ్బాయి మధ్య ఇటు తండ్రి అతి ప్రేమ మధ్య ఏ విధంగా నలిగిపోతుంది..
కలిసి వచ్చిన అంశాలు:
అద్భుతమైన కథ
హీరో హీరోయిన్స్ యాక్టింగ్
క్లైమాక్స్ ట్విస్ట్
చైతన్య జొన్నలగడ్డ నటన
కలిసిరాని అంశాలు:
కొన్ని సీన్స్ లాగి చూపించడం
ఎడిటింగ్ లోపం
స్లో కథనం
రేటింగ్:
2.5/5
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి