టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో యూత్ ఐకాన్ గా మారిపోయాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి సినిమాలతో వరుసగా విజయాలు అందుకొని స్టార్ హీరోగా ఎదిగాడు. గత నెల నోటా సినిమాతో వచ్చిన అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన తాజా సినిమా ‘టాక్సీవాలా’. నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంక జువల్కర్ హీరోయిన్గా నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇప్పటికే ఈ సినిమా చాలా లేట్ అయింది. అయినా కూడా లేటెస్ట్గా వస్తున్నానంటన్నాడు. విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" విడుదలకు మరో అడుగు ముందుకేసింది. ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కట్స్ లేకుండా దీనికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డ్. చాలా కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గానే వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్, సాంగ్స్, ప్రమోషనల్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.
ఈ అంచనాల్ని మరింత పెంచే విధంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. ఈ నెల 11న జరగబోయే ఈ వేడుకకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వస్తుండండం విశేషం. కామెడీతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా టాక్సీవాలాలో చాలా ఉన్నాయని.. ఇదే సినిమాకు బలం అంటున్నారు దర్శక నిర్మాతలు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్లో కూడా వేగం పెంచేసారు యూనిట్. ఇప్పటికే విడుదలైన మాటే వినదుగా పాట బాగానే వైరల్ అవుతుంది. ఇక విజయ్ కూడా ప్రమోషన్‌తో బిజీ అయిపోయాడు. అంచనాల సంగతి ఎలా ఉన్నా.. కథపై ఉన్న నమ్మకంతో మరోసారి తను హిట్ ట్రాక్ ఎక్కుతాననే నమ్మకంతో కనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ. మరి మనోడి ఆశ టాక్సీవాలా తీరుస్తుందా లేదా అనేది చూడాలి.