మంచు వారి ఇంటి మహాలక్ష్మి మంచు లక్ష్మి ట్విట్టర్ వేధికగా తన తెలుగుపై తానే జోక్ వేసుకుంది. మంచు మోహన్ బాబు ఏకైక పుత్రిక పుటింది తెలుగు గడ్డపైనే కానీ తెలుగులో అక్షరం ముక్క రాదు. రాయడం అంటే సరేలెండి మాట్లాడం కూడా రాదు మన లక్ష్మక్కకి. పుట్టినప్పటి నుండి రాని తెలుగుని ఇప్పుడిప్పుడు అక్క ఎలా నేర్చుకోగలదు. అందుకే 5 ఏళ్ళైనా తెలుగు రాలేదు మంచు లక్ష్మికి. 


గత వరం నుండి ఓ విదేశీయుడు తెలుగులో మాట్లాడి ప్రతి ఒకరిని ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఆలా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయ్యిందన్న విషయం తెలిసిందే. అయితే ఆ విదేశీయుడు స్నేహితుడు మన తెలుగు వాడే. దీంతో అతను విదేశీయుడు తెలుగు మాట్లాడుతున్నప్పుడు తీసిన మరో వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసాడు. 


ఆ వీడియోని చుసిన మంచు లక్ష్మి అది షేర్ చేస్తూ 'తన తెలుగు కంటే అతని తెలుగే బాగుందని' వీడియో లింక్ ని షేర్ చేసింది. ఆ ట్విట్ చుసిన నెటిజన్లు అంత మేము అదే చెప్తున్నాం కదా అక్క అంటూ ట్విట్ కి రిప్లై ఇస్తున్నారు. అయితే ఈ ట్విట్ కు బ్రహ్మ జి కూడా 'నీ దుంప తెగ, ఎంత బాగా మాట్లాడుతున్నావ్' అంటూ కామెంట్ చేసాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ అవుతుంది.    



మరింత సమాచారం తెలుసుకోండి: