అమెరికాలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ నిర్వహించిన క్రీడాపోటీల్లో ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాల్లాస్ లోని ప్లానోలో జరిగిన పోటీల్లో పురుషులతో పాటు మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. 

విజేతలకు టాంటెక్ సంస్థ బహుమతులను అందజేసింది.ఎప్పుడూ పని వత్తిడితో ఉండే ప్రవాసభారతీయులు ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల అందరూ ఒకే దగ్గర చేరి సంతోషంగా గడపడం చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని సంస్థి నిర్వాహకులు తెలిపారు.  ప్రవాసాంధ్రలో నిత్యం బిజీగా గడిపే వారు సమయం వెచ్చించి క్రీడల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని టాంటెక్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: