ఈ మద్య కాలంలో సెలబ్రెటీలు ఓ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు..తమను అమితంగా ఇష్ట పడే వారికోసం, అనారోగ్యంతో చివరి ఘడియల్లో ఉన్న వారు సెలబ్రెటీలను చూడాలనిపిస్తే స్వయంగా వెళ్లి వారిని పలుకరించి వారికి మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఈ కోవలో తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబా ఇలా చాలా మంది తమ అభిమానులను కలుసుకొని కనువిందు చేశారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే బాటలో నడిచాడు.
ఆమె 106ఏళ్ల ఓ బామ్మ ఒబామాను గత సంవత్సరం నుంచి కలవాలని అర్జీ పెట్టుకుందట మొత్తానికి ఆమె కోరిక నెరవేర్చాడు. సతీసమేతంగా ఒబామా ఆ బామ్మతో కలిసి డ్యాన్స్ చేశారు.ఈ అరుదైన దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. అమెరికాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన వర్జీనియా మెక్‌లౌరిన్ అనే 106ఏళ్ల వృద్ధురాలికి ఎప్పట్నుంచో అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు వెళ్లాలని కోరిక. దీనికోసం ఇటీవల ఒబామాకు దరఖాస్తు పెట్టుకుంది. స్పందించిన ఒబామా ఆమెను ఆహ్వానించగా ఆ వృద్ధురాలు బైట్ హౌజ్ కు చేరుకుంది.
ఒబామా దంపతులను కలిసిన సంతోషంలో వర్జినీయా మెక్ లౌరిన్

సతీమణి మిచెల్లీతో కలిసి వర్జీనియారాకను గమనిస్తూనే ఆ బామ్మ ఒక్కసారిగా ఉత్సాహంతో ఊగిపోయింది. స్టెప్పులేస్తూ ఒబామా దంపతులను పలుకరించింది. అంతే కాదు ఒబామా ఆయన సతీమణి మిచెల్లీతో కలిసి ఆ బామతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఇంత వయసులో ఉత్సాహంగా వర్జీనియా డ్యాన్స్ చేయడాన్ని చూసి ఒబామా ఆశ్చర్యపోయారు. వైట్‌హౌస్‌లో అడుగుపెట్టే అవకాశం తనకు దక్కుతుందని ఊహించలేదని వర్జీనియా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. నల్లజాతీయుడు అమెరికా అధ్యక్షుడిగా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని, తానూ నల్లజాతీయురాలినేనని తెలిపింది.