అగ్ర రాజ్యం అమెరికాపై కరోనా అలసట లేకుండా చేస్తున్న విలయం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రోజు రోజుకి వేలాది కేసులు నమోదవుతున్న నేపధ్యంలో కరోనా ని కంట్రోల్ చేయలేక అమెరికా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. లాక్ డౌన్ పేరుతో నిభందనలు విధిస్తున్నా ఎంతో మంది అమెరికన్స్ నిభందనలు లెక్క చేయకుండానే సోషల్ డిస్టెన్స్ పాటించకుండా వీధుల్లో తిరుగుతున్నారు. మరో పక్క

IHG't about the Americans who died from ...

నిత్యవసరాలు అయిపోవడంతో ప్రజలు ఫుడ్ బ్యాంక్స్ వద్ద బారులు తీరుతున్నారు. ఇలా అవసరాల నిమిత్తం ఫుడ్ బ్యాంక్స్ వచ్చే వారితో రోడ్లన్నీ నిండిపోతున్నాయి. చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ ఎత్తివేయాలంటూ ప్రజలు అందరూ గుంపులు గుంపులుగా చేరి ఆందోళనలు చేపడుతుంటే వారికి ట్రంప్ సైతం మద్దతుగా నిలవడం మరింతగా ఆందోళనలని కలిగిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన మరణాలు బాధితుల సంఖ్య అమాంతం పెరిగిపోవడానికి కారణం కేవలం సోషల్ డిస్టెన్స్ పాటించక పోవడం వలనేనని నిపుణులు హెచ్చరించినా ఫలితాలు మాత్రం శూన్యం అనే చెప్పాలి..ఈ చర్యల ఫలితమే

IHG

అమెరికాలో ప్రస్తుతం మరణాల సంఖ్య 40వేలకి చేరుకుంది. 24 గంటలు గడిచేలోగానే 1500 మృతి చెందటంతో ప్రస్తుతం మరణాలు 40 వేలకి చేరుకున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ ఎక్కడా కంట్రోల్ అయిన దాఖలాలు కనిపించడం లేదు నిన్నటితో పోల్చుకుంటే కరోనా భాదితుల సంఖ్య 15వేలు పెరగడంతో ప్రస్తుతం బాధితులు 7.64 లక్షలకి చేరుకున్నారు. అయితే గతంలో కరోనా పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం సంఖ్య తగ్గినట్టుగానే కనిపిస్తోందని అంటున్నారు నిపుణులు..

మరింత సమాచారం తెలుసుకోండి: