అమెరికా నుంచి చాలా మంది మన దేశానికి తిరిగి వచ్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికాలో ఇప్పుడు ఉన్న   పరిణామాల ఆధారంగా చూస్తే అక్కడ ఏ  మాత్రం కూడా అనుకూలమైన వాతావరణం లేదు అని భావిస్తున్న చాలా మంది తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికన్లకు ఉద్యోగాలు అని చెప్తున్నా అక్కడి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమకు మిత్ర దేశాలుగా ఉండే వారి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఏ ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆయన త్వరలోనే ఒక ప్లాన్ ని ప్రకటిస్తారు.

అమెరికా ఎన్నికలకు ఇంకా నాలుగు రోజులే ఉన్న నేపధ్యంలో ట్రంప్ ఒక ప్లాన్ ని ప్రకటించే అవకాశం ఉంది అని అందరు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన కూతురు ఇవాంకా తో కూడా చర్చలు జరుపుతున్నారు అని టాక్. అమెరికాలో ఉండటానికి మన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తాను గెలిస్తే  భారతీయుల ఉద్యోగాలకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు అనే అంశాన్ని ఆయన చెప్పే అవకాశం ఉంది అని తెలుస్తుంది. అంతే కాకుండా తాను గెలిస్తే అక్కడ స్థిరపడిన ఉద్యోగులు అందరికి కూడా ప్రభుత్వం నుంచి ఒక బీమా కార్యక్రమాన్ని కూడా అందించే విధంగా కూడా ప్లాన్ చేస్తాను అని చెప్పే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఎన్నారై ల కోసమే ప్రత్యేకంగా  ఒక ప్లాన్ ని ఆయన విడుదల చేయవచ్చు అని అంటున్నారు. మరి ఇది ఎలా ఉంటుంది ఏంటీ అనేది చూడాలి. ఇక ఈ ఎన్నికల్లో ట్రంప్ వైపు నిలబడే ఆలోచన మన వారిలో లేదు అని కూడా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటీ అనేది చూడాలి. నవంబర్ 3 న ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: