అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు భారత్ తో స్నేహం కొనసాగించే ఆలోచనలో ఉన్నారని రాజకీయ వ్యాపార నిపుణులు వ్యాఖ్యానిస్తుంది. ఎందుకు ఏంటీ అనేది చూస్తే... దానికి పెద్ద కారణం ఉంది అంటున్నారు. సాధారణంగా ట్రంప్ అసలు రాజకీయ నాయకుడు కాదు. ఆయన వ్యాపారవేత్త. ఆయన పాలన కూడా వ్యాపారం చేసినట్టే ఉంది అనేది చాలా మంది చెప్పే మాట. ఇప్పుడు ఆయన భారత్ తో సావాసం కూడా అందుకే చేస్తున్నారు. ముందు నుంచి కూడా మోడీతో ఆయన ఎక్కువగా సావాసం చేస్తున్నారు.

ట్రంప్ గెలుపు కోసం మోడీ భారీ సభ కూడా నిర్వహించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ట్రంప్... మోడీతో ఉన్న స్నేహాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. త్వరలోనే ఆయన అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత వ్యాపారం కోసం భారత్ వచ్చి భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు అని అంటున్నారు.  ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, సహా దేశంలో పలు కీలక నగరాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

భారత్ లో దాదాపుగా 10 నగరాల్లో ఆయన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఈ మేరకు త్వరలో తన కుమార్తెతో కలిసి పారిశ్రామిక వేత్త  హోదాలో ఆయన వస్తున్నారు. ఇక భారతీయుల విషయంలో ట్రంప్ కాస్త జాగ్రత్తగానే ఉన్నారు. అయితే ఆయనకు ఈ ఎన్నికల్లో వాళ్ళు ఓట్లు వేసారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. బిడెన్ కూడా త్వరలో భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ట్రంప్ మాత్రం ఇప్పుడు భారత పర్యటనకు రావడం సర్వత్రా కూడా ఆసక్తికరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: