విదేశాలకు వెళ్లి చదువుకోవడం విదేశాల్లో స్థిరపడటమనేది చాలామందికి ఒక కల. అయితే ఈ కలను నెరవేర్చుకునే విషయంలో చాలామంది విఫలమవుతుంటారు. దీనిపై కొంత మందిలో ఆవేదన కూడా ఉంటుంది. కొంతమంది విదేశాలకు వెళ్లి చదువుకోలేని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది అనే మాట వాస్తవం. గతంలో కంటే ఇప్పుడు పరిస్థితులు మారిపోవడం ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడంతో ఇబ్బందులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విదేశాలకు వెళ్లి చదువుకున్న వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నాయి.

అదే విధంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అని భావించే వారి విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకొనే వారి విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాస్త సానుకూలంగా అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొందరు అధికారులతో సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒక పాలసీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని టాక్.

విదేశాలకు వెళ్ళి చదువుకొనే రైతు బిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని ద్వారా ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించడానికి జగన్ సిద్ధమవుతున్నారని తెలుస్తుంది. ప్రతి ఏటా దాదాపు వెయ్యి మందికి రాష్ట్ర ప్రభుత్వం విదేశాలకు వెళ్ళి చదువుకొనే అవకాశం కల్పించడానికి రెడీ అవుతుందని, వేగంగా ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా కూడా సమాచారం. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చర్చించే అవకాశాలు ఉండవచ్చని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఎన్నారైలు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్లకు కూడా కొన్ని వెసులుబాటులు కల్పించడానికి సిద్దమయ్యారు అనే ప్రచారం ఉంది. మరి ఈ విషయంలో ఎలాంటి అడుగు పడుతుందో ఉగాది తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: