ఉక్రెయిన్ అతలాకుతలం అవుతుంది.  అగ్రరాజ్యమైన రష్యా ఎక్కడ వెనకడుగు వేయకుండా కనీసం మానవత్వం చూపించకుండా ఉక్రెయిన్ పై భీకర రీతిలో దాడులకు పాల్పడుతూనే ఉంది. దీనితో పాటు చిన్న దేశం అయినప్పటికీ రష్యా సైన్యాన్ని నిలువరించేందుకు ఉక్రెయిన్  ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇక రష్యా సేనల ధాటికి ఉక్రెయిన్లో మాత్రం అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.. మొన్నటి వరకు కేవలం ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నాం అంటూ చెప్పింది రష్య. కానీ ఇప్పుడు మాత్రం జనావాసాల పై కూడా బాంబుల వర్షం కురిపిస్తూ ఉక్రెయిన్ లో మారణహోమం సృష్టిస్తుంది.



 ఇటీవల యుద్ధ విరమణ కోసం అటు ఉక్రెయిన్ రష్యా దేశాలకు చెందిన ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలలో ఇరు దేశాలు ఓకే నిర్ణయానికి రాకపోవడంతో చివరికి చర్చలు విఫలం గానే ముగిసిపోయాయి అని చెప్పాలి. ఇక చర్చలు విఫలం అయిన నేపథ్యంలో మరింత దూకుడుగా ఉక్రెయిన్ పై విరుచుకు పడుతుంది రష్య. ఇక ఇటీవలే ఏకంగా ఉక్రెయిన్లోని హాస్పిటల్స్ ని టార్గెట్ గా చేసుకుని బాంబుల దాడి చేస్తుంది. ఇకపోతే ఇటీవల ఒక ఖరీదైన హోటల్ పై రష్యా బాంబు దాడి చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.


 ఇక ఈ బాంబు దాడికి సంబంధించిన సంఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇక ఉక్రెయిన్ లో రెండో అతి పెద్ద నగరమైన ఖర్కెవ్ లో ఒక భవంతి పై రాకెట్ ఎటాక్ చేసింది రష్య. ఇక ఈ బాంబు దాడితో ఒక్కసారిగా ఆ భవనం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో 11 మంది పౌరులు మరణించారు అని తెలుస్తోంది. చాలా మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. ఉక్రెయిన్  రాజధాని కీవ్ వైపు ప్రస్తుతం వందలాది రష్యా యుద్ద ట్యాంకులు తరలి వెళ్తున్నాయి అన్న విషయాన్ని కూడా అటు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: