పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం నేపద్యంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి అక్కడ ప్రజల పరిస్థితి దీనంగా మారిపోయింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కనీసం అక్కడ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించడం మానేసి ఇక చివరికి ప్రభుత్వ భవనాలను సైతం అద్దెకిచ్చి వచ్చిన డబ్బులతో ఇక ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్న దుస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు మొత్తం చివరికి అద్దెకు ఇస్తూ వస్తుంది అక్కడి ప్రభుత్వం.
ఇక ఇటీవల మరో ప్రభుత్వ ఆస్తిని సైతం అద్దకు ఇచ్చేందుకు సిద్ధమైంది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇప్పటికే విదేశాల్లో ఉన్న చరాస్తులను అమ్మడం అద్దకి ఇవ్వడం చేస్తున్న ప్రభుత్వం.. ఇటీవల పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న ప్రధాన ఓడరేవును యూఏఈకి చెందిన ఏ డి పోర్ట్ గ్రూప్ కి అద్దెకు ఇచ్చింది. 50 ఏళ్ల పాటు కరాచీ పోర్ట్ నిర్వహణ బాధ్యతలను ఏడి గ్రూప్ పోర్టు చూసుకుంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఏడి గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నందుకు గాను ఇక 220 మిలియన్ల డాలర్లు పాకిస్తాన్ కు దక్కబోతున్నాయి అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి