ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపద్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాడు మనిషి. ఈ క్రమంలోనే వెలుగులోకి  వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. అతను అందగాడు. అందగాడు అంటే మామూలు అందగాడు కాదు ఏకంగా దేశంలోనే అతని మించిన అందగాడు మరొకరు లేరు.


 ఇది ఎవరు చెప్పారు అనుకుంటున్నారా.. ఏకంగా అందాల పోటీల్లో పాల్గొన్న సమయంలో అతని దేశంలోనే అందగాడిగా అవార్డును కూడా అందుకున్నాడు. అయితే ఇలాంటి హోదాని సంపాదించిన తర్వాత ఎవరైనా సరే ఇక మోడలింగ్లో రాణించడం లేదంటే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక దేశంలోనే అందగాడిగా పేరు సంపాదించుకున్న 21 ఏళ్ళ యువకుడు చేసిన పని మాత్రం ప్రస్తుతం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఎవరు ఊహించని నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరిని ముక్కున వేలేసుకునేలా చేస్తూ ఉన్నాడు సదరు యువకుడు.


 ఇటలీలో ఈ ఘటన జరిగింది. ఏకంగా ఆ దేశంలోనే అత్యంత అందమైన పురుషుడిగా ఏడివాడో శాంటనికే అనే 21 ఏళ్ల యువకుడు నిలిచాడు. ఇక అతను మోడలింగ్ నటనలో కూడా కెరియర్ మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ కెరియర్ మొత్తం పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక బాటపట్టాడు. ఏకంగా మత బోధకుడిగా మారాలని నిర్ణయించుకున్నాడు. దేవుడు సేవ చేయాలని తనకు పిలుపు వచ్చిందని.. ఈ క్రమంలోనే క్యాథలిక్ చర్చి తరఫున బోధిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు ఏడివాడో శాంటనికే. కాగా 2019 పురుషుల అందాల పోటీలలో ఈ యువకుడు విజేతగా నిలిచి సెలబ్రిటీగా మారాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్  టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri