
ఇలా ఒక్కరోజు ఆహారం తీసుకోకపోతేనే మనిషి డీలా పడిపోయి.. కనీసం నడవలేని స్థితికి చేరుకుంటూ ఉంటాడు. అదే రెండు రోజులు అన్నం తినకుండా ఉంటే.. ఇంకేముంది మంచానికే పరిమితం అవుతూ ఉంటాడు. ఇక మూడు నాలుగు రోజులు అన్నం తినకుండా ఉన్నాడు అంటే కొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు కోల్పోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఆమె ఒక్కటి కాదు రెండు కాదు 50 సంవత్సరాలుగా ఆహారం లేకుండానే జీవనం సాగిస్తుంది. నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవిస్తుంది మహిళ.
ఆమె వయసు 75 ఏళ్లు. తాను 50 సంవత్సరాలుగా ఎటువంటి ఘన పదార్థాలను ఆహారం తినట్లేదు అంటూ చెబుతుంది ఆమె. వియత్నానికి చెందిన ఆ మహిళ ఇప్పటివరకు కేవలం నీళ్లు కూల్ డ్రింక్స్ వంటివి మాత్రమే తీసుకుంటున్నట్టు తెలిపింది. 1963 సంవత్సరంలో ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి మరికొందరు మహిళలతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురై కింద పడిపోయారు. అయితే కొంతకాలానికి కోలుకున్న మహిళ అప్పటినుంచి ఆహారానికి బదులుగా మంచినీళ్లు మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఆమె ఆహారం తీసుకోకపోయినా తన పిల్లలకు మాత్రం ఆహారం వండి పెడుతుందట సదరు మహిళ.