అంతేకాదు ఇక ఎప్పుడూ స్కూలు, కాలేజీలకు డుమ్మా కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక చిన్న చిన్న కారణాలకే ఏకంగా కాలేజీలు స్కూళ్ళకి వెళ్లకుండా డూమాలు కొట్టడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలా నేటి రోజుల్లో యువత చదువును భారంగా భావిస్తూ పక్కన పెడుతుంటే కొంతమంది మాత్రం ఏకంగా వృద్ధాప్యంలో కూడా చదువును కొనసాగిస్తూ చనిపోయే లోపు ఎలాగైనా డిగ్రీ పట్టా పొందాలి అని ఆశ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో కూడా చదువుకొని కొనసాగించి ఇక అనుకున్నది సాధిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే 90 ఏళ్ల మహిళ కూడా ఇలాంటి కోవలోకి చెందిన వారే.
30 ఏళ్ల వయసుకే చదువుకునే మూడ్ లేదనే రోజులువి. అలాంటిది యూఎస్ లో మిన్నీ పెయిన్ అనే మహిళా 90 ఏళ్ల వృద్ధురాలిగా ఉన్నప్పటికీ డిసీప్లినరీ స్టడీస్ లో మాస్టర్స్ డిగ్రీని కంప్లీట్ చేశారు. ముని మనవళ్ళ వయస్సు ఉండే వారితో కలిసి ఆమె పట్టాను అందుకున్నారు. నా పేరెంట్స్ చాలా పేదవారు. దీంతో 1955లో జూనియర్ కాలేజీ పూర్తయ్యాక చదువును ఆపేసా. ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకున్న. పిల్లలు కుటుంబం ఇలా అన్ని బాధ్యతలు వచ్చాయి. కానీ చదువుపై ప్రేమ తగ్గక.. ఇప్పుడు మాస్టర్స్ లో డిగ్రీ పట్టా పొందాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి