పృథ్వీరాజ్ అంటే కొంతమందికి తెలియక పోవచ్చు కానీ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ అంటే తెలియని వారు ఉండరు. టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో పృథ్వీ ఫేమస్ కమిడియన్ గా ఎదిగారు. లౌక్యం సినిమాలో లెజెండ్ సినిమా స్పూఫ్ లో బాలయ్య బాబులా నటించి ప్రేక్షకులను అలరించారు. సినిమాలో పృథ్వీ చేసిన కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మొత్తం ఇప్పటివరకు ఆయన 250కి పైగా చిత్రాల్లో నటించి అలరించారు. ఇక పృథ్వీరాజ్ సినిమాలకు కొంత దూరంగా ఉండి ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. దాంతో ఎన్నికల్లో వైసిపి గెలవడంతో ఆయనకు ఎస్వీబీసీ ఛైర్మెన్ గా భాద్యతలు అప్పగించారు. అయితే ఒక మహిళతో అసభ్యంగా ఆడియో కాల్ మాట్లాడారని ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి ఐదు నెలల్లోనే రాజీనామా చేసారు. అనంతరం పలు ఇంటర్వ్యూలలో తనపై కావాలనే కుట్ర పన్నారని పృథ్వీరాజ్ వెల్లడించారు. తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. ఇక తాజాగా పృథ్వీరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

తనకు రాజకీయాలంటే ఉన్న దురద తోనే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాన్న లాంటి వారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరే నిష్వర్థంగా ప్రజలకోసం పనిచేసే నేతలు పుట్టారని వ్యాఖ్యానించారు. అందులో ఒకరు ఎన్టీ రామారావు అని...మరొకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ అంటే తనకు ముందు నుండి ఎంతో అభిమానమని చెప్పారు. వైఎస్ఆర్ తనకు నాన్న లాంటివారని చెప్పారు. ఇక ఎస్వీబిసి ఛైర్మెన్ గా తాను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయలనుకున్నానని తెలిపారు. జగన్ ను ఆదర్శంగా తీసుకుని ఎస్వీబీసీ ని డెవెలప్ చేయాలనుకునట్టు తెలిపారు. కానీ అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయని అన్నారు. ఎస్వీబీసీ లో పనిచేస్తున్నవారిలో చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనే బిజీగా ఉన్నారని తెలిపారు. తాను ఛైర్మెన్ గా ఉన్నప్పుడు తనను ముందే పంపిస్తారని ఊహించానని అన్నారు. పని చేయాలని చెప్పినందుకే తనపై కుట్ర పన్నారని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: