బీజేపీ అంటేనే హిందుత్వానికి ఓ బ్రాండ్ అన్న ముద్ర ఉంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికలో గెలుపు కోసం కూడా బీజేపీ హిందుత్వం అంశాన్నే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారం పీక్స్ కు వెళ్తున్న కొద్దీ బీజేపీ డోస్ పెంచుతోంది. ఇప్పుడు వైసీపీ అభ్యర్థి క్రైస్తవుడన్న విషయాన్ని హైలెట్ చేస్తోంది. అంబేడ్కర్ జయంతి సందర్భంగా  తిరుపతిలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన బీజేపీ నేతలు గురుమూర్తి క్రిస్టియన్ అన్న అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రసంగించారు.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని దీపాలతో నివాళులర్పించిన  బీజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్ చార్జి సునీల్ దేవ్ ధర్.. ఎస్సీలు మతం మారితే వారికి రిజర్వేషన్ వర్తించదని అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. సునీల్‌ దేవధర్ ఇంకా ఏమన్నారంటే.. “ తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైకాపా ఏం చేస్తోంది? తిరుపతి పార్లమెంట్ వైకాపా ఎంపీ అభ్యర్థి గురు మూర్తి ది ఏ మతం? ఆయన ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకోలేదు.. నామినేషన్ వేసే ముందు గూడూరులో పాస్టర్ దగ్గర్నుంచి ఆశీర్వాదం తీసుకున్నారన్నారు సునీల్ దేవ్‌ధర్.

ఆయన ఇంకా ఏమన్నారంటే.. “  నామినేషన్ వేసే ముందు గూడూరులో పాస్టర్ దగ్గర్నుంచి ఆశీర్వాదం తీసుకున్నారన్నారు అనేందుకు తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు గురుమూర్తి మొదట సోషల్ మీడియాలో పెట్టి తర్వాత తొలగించారు.. గురుమూర్తి మతం పై సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదు? దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.. గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.. ఎన్నికలు అయిపోయినా మేం న్యాయపరంగా పోరాడుతాం.. ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటున్నారు బీజేపీ నేతలు.


" గోవిందనామాలు పెట్టుకుంటే మంత్రి పేర్ని నాని అవహేళన చేస్తున్నారు.. శ్రీవారి నామాలు డ్రామా లాగా కనిపిస్తున్నాయా? రెండేళ్ల క్రితం రాష్ట్రానికి భాజపా తరఫున ఇన్చార్జిగా నియమించగానే స్వామివారికి తలనీలాలు ఇచ్చా..  క్రైస్తవ మతానికి భాజపా వ్యతిరేకం కాదు.. హిందూ మతాన్ని అడ్డంపెట్టుకుని అన్య మతాలను అనుసరిస్తుంటే ఊరుకోం అంటున్నారు సునీల్‌ దేవ్‌ధర్.


మరింత సమాచారం తెలుసుకోండి: