ఎక్కడైనా ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలకు తాము పోటీ చేసే సీట్లపై ఫుల్ క్లారిటీ ఉంటుంది. కానీ ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాత్రం తాను పోటీ చేసే సీటుపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. మామూలుగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం ఉండగా, వైసీపీ అధినేత జగన్‌కు పులివెందుల నియోజకవర్గం ఉంది. ఆ ఇద్దరికి వారి నియోజకవర్గాల్లో తిరుగులేదు. వారు నియోజకవర్గాలకు వెళ్లకపోయినా ఎన్నికల్లో గెలిచే పరిస్తితి ఉంటుంది.

కానీ పవన్ కల్యాణ్‌కు అలా కాదు. ఇంకా వారి స్థాయికి పవన్ రాలేదనే చెప్పొచ్చు. పోనీ అలా రావడానికి ఏమన్నా కష్టపడుతున్నారా అంటే అది కనిపించడం లేదు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. అయితే రాజకీయాల్లో ఓటమి అనేది సహజమే...అలా అని ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకుని పవన్ బలపడాలి. కానీ ప్రస్తుతానికి పవన్ బలపడే పరిస్తితి ఉన్నట్లు కనిపించడం లేదు.

అసలు నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన ఎక్కడ పోటీ చేస్తారో కూడా సరిగ్గా క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన గాజువాక, భీమవరం స్థానాల్లో పవన్ మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందో లేదో కూడా తెలియడం లేదు. ఇక ఈ రెండు కూడా కాదని పవన్ తిరుపతిలో పోటీ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరుపున చిరంజీవి తిరుపతిలో పోటీ చేసే గెలిచారు.

ఇప్పుడు అదే స్థానంలో పవన్ పోటీ చేస్తారని, అక్కడ పవన్‌కు గెలిచే ఛాన్స్ ఉందని జనసేన శ్రేణులు ప్రచారం చేస్తున్నారు. కానీ తిరుపతిలో పవన్‌కు గెలుపు అంత సులువు కాదని తెలుస్తోంది. ఎందుకంటే మునుపటి పరిస్తితులు తిరుపతిలో లేవు. అక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ఆ తర్వాత టీడీపీ కూడా గట్టిగానే ఉంది. ఈ రెండు పార్టీల మధ్యలో పవన్ గెలవడం కష్టమని తెలుస్తోంది. అందుకే పవన్ వేరే నియోజకవర్గాన్ని ఎంచుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: