ఇటీవలే గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రు లో తెదేపా నాయకురాలు అయిన శారదా ఇంటిపై జరిగిన రాళ్లదాడి కాస్త ఏపీ రాజకీయాలలో సంచలనం గా మారిపోయింది. అయితే  ఈ ఘటనను పోలీసులు సవాల్ గా తీసుకున్నారు  తాజాగా ఈ ఘటనపై  ఎస్పి విశాల్ గున్నీ స్పందించారు. అయితే టీడీపీ నాయకురాలు శారద ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ఘటనలో ఏకంగా 16 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాము అన్న విషయాన్ని ఇటీవలే ఎస్పీ విశాల్ గున్నీ చెప్పుకొచ్చారు. ఇక ఘటన జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు వివిధ బృందాలుగా ఏర్పడ్డారు.



 ఈ క్రమం లోనే ఈ ఘటన లో నిందితులను పట్టు కోవడానికి బాపట్ల బీఎస్పీ ఆధ్వర్యం లోని బాపట్ల రూరల్ సీఐ, పొన్నూరు రూరల్ సీఐ, పట్టణ సిఐ లతో కలిసి మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చట్ట పరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని ఎస్ పి విశాల్ గున్నీ చెప్పు కొచ్చారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని తెలిపారు  శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు



 అయితే వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయి ఏకంగా మాజీ జెడ్పిటిసి బత్తిని శారద ఇంటిపై దారుణంగా దాడి చేయడం రాళ్లు రువ్వడం లాంటిది సంచలనంగా మారింది. అయితే బయట నుంచి దాడి చేయడమే కాదు ఇంట్లోకి దూరి సామాగ్రిని సైతం దారుణంగా ధ్వంసం చేశారు. ఇక ఇంట్లో ఉన్న సామాగ్రీ ధ్వంసం చేయడమే కాదు ఆ ఇంట్లో ఉన్న ద్విచక్ర వాహనాలను కూడా పెట్రోల్ పోసి నిప్పంటించటం సంచలన గా మారిపోయింది. ఇక ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాము అంటూ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: