ఇద్ద‌రు కుడి, ఎడ‌మ భుజాల్లాంటోళ్లు జ‌గ‌న్ కు.. ఒక‌రు అంబానీ మ‌రొక‌రు అదానీ. గుజరాత్ షావుకార్ల‌ను బాగానే న‌మ్మ‌కుని ఎదిగాడు జ‌గ‌న్. అందుకే రాష్ట్రం అధిక అంధ‌కారాన్ని మోయ‌డానికి సిద్ధం అవుతోంది. అయినా కూడా విశ్వాస పాత్ర‌త అన్న‌ది జ‌గ‌న్ కు ఉంది అదేవిధంగా గతంలోనూ ఇదే త‌ర‌హా ప్రేమ టీడీపీకీ ఉండేది. ప్రేమ కార‌ణంగానే జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాడు అన్న‌ది అంద‌రికీ తెలిసిందే.. ఆ ప్రేమ జ‌నంపై కాదు కార్పొరేట్ల‌పై అన్న‌ది ఇవాళ్టికి స్ప‌ష్టం అయి ఉంది.


కార్పొరేట్ శ‌క్తుల‌ను న‌మ్ముకోవ‌ద్దు అని అంతా గ‌గ్గోలు పెడుతున్నా పాపం జ‌గ‌న్ మాత్రం వాటికే జీ హుజుర్ అంటారు. ఆయ‌న‌కు తెలుసు కార్పొరేట్ వ్య‌క్తులు అంత‌గా దేశానికి ప్ర‌యోజ‌నకారులు కార‌ని, కాలేర‌ని! అయినా కూడా జ‌గ‌న్ వారినే న‌మ్ముకుంటాడు. వీలున్నంత మేర‌కు వారికి అగ్ర స్థానం ఇచ్చి, అగ్ర తాంబూలం ఇచ్చి మ‌రీ! బంగారు పోగుల శాలువాల‌తో స‌త్క‌రించుకుంటాడు. తిరుప‌తి వెంక‌న్న వెండి ప్ర‌తిమ‌ను ఇచ్చి వారి ప్ర‌తిభ‌ను కొనియాడుతాడు. అందుకే వారు తెలివిగా శ్రీ‌వారి సేవ‌ల పోర్ట‌ల్ ను ఉచితం పేరిట ద‌క్కించుకుంటారు.


ఈ పని జియో కంపెనీ వాడు  చేశాడు స‌రే! మ‌రి అదే భ‌క్తితో తిరుప‌తి ప‌రిధిలో రాయ‌ల సీమ ప్రాంతాల‌లో ఉన్న విద్యుత్ కొర‌త‌ను నివారించే ప‌ని అంబానీ ఎందుకు చేయ‌డు? అదానీ ఎందుకు చేయ‌డు? వాళ్ల‌కు తెలుసు ఏ ప‌ని ఎంత మేర‌కు ఫ‌లితం ఇస్తుందో నన్న‌ది..మ‌న పాల‌కుల‌కే అవి ఇంకా అర్థం కావ‌డం లేదు. జ‌గ‌న్ అనుభవ శూన్య‌తే రాష్ట్రాన్ని ఇంత‌గా అధోగ‌తి పాల్జేస్తుంది అన్న‌ది వాస్త‌వం. రేప‌టి అంధ‌కారానికి ఇప్ప‌టి అధికార దాహ‌మే కార‌ణం. అయినా ఆయ‌న అంబానీల‌కు రాజ్య స‌భ ప‌దవులు, అదానీల‌కు పోర్టులు క‌ట్ట‌బెట్టి భ‌క్తి ప్ర‌ద‌ర్శిస్తాడు. ఎందుకంటే ఎన్నికల వేళ వాళ్లే రియ‌ల్ ఇన్వెస్ట‌ర్లు క‌నుక. వారితోనే క‌లిసి అడుగులు వేసి రాష్ట్రాన్ని అధోగ‌తి పాల్జేసినా ఎవ్వ‌రూ ప్ర‌శ్నించ‌రు ?


జ‌గ‌న్, అదానీ మంచి మిత్రులు. ఆల్రెడీ గంగ‌వ‌రం పోర్టులో ఏపీ ప్ర‌భుత్వ వాటాల‌ను కూడా అదానీకే అమ్మేశాడు జ‌గ‌న్. ఇంకేముం ది అమ్ముకునేందుకు..ఇందుకు బ‌దులుగా ఆ గుజరాతీ షావుకారి మ‌న‌కు ఏమ‌యినా సాయం చేస్తాడా అంటే అదీ లేదు. ఆయ న ప‌రిధిలో కొన్ని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అదేవిధంగా నిన్న‌నో మొన్న‌నో ఒడిశా, ఛ‌త్తీస్ గ‌ఢ్ ల‌లో ద‌క్కించుకున్న బొగ్గు గ‌ను లు (ఓపెన్ బిడ్డింగ్ ద్వారా ద‌క్కించుకున్న‌వివి) ఉన్నాయి. పోనీ అవ‌యినా మ‌న‌కు ఇస్తాడా.. కొంతలో కొంత సాయం చేస్తా డా అంటే అదీ లేదు. ప్ర‌భుత్వాల‌కు కార్పొరేట్ల‌పై ప్రేమ ఉన్నంత కాలం ఫ‌లితాలు లేదా ఫ‌లాలన్నవి ఇలానే ఉండి ఏడుస్తాయి అనేం దుకు తార్కాణం తాజా ఘ‌ట‌న‌లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ycp