రాజ‌కీయంలో మ‌నుగ‌డలో ఉండాలంటే సామాజికి స‌మీక‌ర‌ణ‌లు కీల‌కం. కుల విధానాల‌కు వ్య‌తిరేకం అని చెప్పుకొస్తున్న వాళ్లు కుల ఆధారిత రాజ‌కీయాలు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కుల రాజ‌కీయాలు కీల‌కంగా మారాయి. రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు అయినా కాపు ఓట్లు ప్ర‌ధాన ప్ర‌భావం చూపెడుతాయి. దీనికి కార‌ణం ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో కాపు ఓటు శాతం భారీగా ఉండ‌డ‌మే. ప్ర‌స్తుతం కాపు ఓట్ల మీద వైస్సార్‌సీపీ ఆశ‌లు వ‌దిలేసుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి వైసీపీ ప్ర‌భుత్వంలో కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కీల‌క ప‌ద‌వుల్లోనే ఉన్నారు.

 
 డిప్యూటీ సీఎం ఆళ్ల నాని నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చాలామంది కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కులు కీల‌క స్థాయిలో ఉన్నారు. అయితే, 2014 లో టీడీపీ కి మ‌ద్ధతు ఇచ్చిన కాపు సామాజిక వ‌ర్గం ప‌రిస్థితుల కార‌ణంగా 2019లో వైసీపీ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది. ఇప్పుడు తాజా పరిస్థితుల ఆధారంగా చూస్తే కాపు ఓటు శాతం వైసీపీకి త‌గ్గుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌భావంతో కాపు సామాజిక వ‌ర్గం వైసీపీ కి దూరం అవుతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే, వైసీపీ అంత‌ర్గ‌త స‌ర్వేలు, పీకే అండ్ టీమ్ అంచ‌నాలు చూసుకుంటే ప్ర‌స్తుతం 10 నుంచి 15 శాతం కాపులు మాత్ర‌మే వైసీపీ పార్టీ వెంట ఉన్న‌ట్టు స‌మాచారం.


 అయితే, ఈ 10 నుంచి 15 శాతం కాపు ఓట‌ర్లు కూడా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వంలో ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఉన్నవాళ్లు, నేత‌లుగా చ‌లామ‌ణి అవుతున్న వారి వెంట ఉన్న వాళ్లేన‌ని మిగ‌తా వాళ్లు పూర్తిగా వైసీపీ కి వ్య‌తిరేకంగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రోప‌క్క ఇంకా అందులో చాలా వ‌ర‌కు 60 నుంచి 70 శాతం వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ వైపు వెళ్లిపోయిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు. ఇంకా 20 శాతం మంది తెలుగు దేశం పార్టీ వైపు ఉన్నారు. భ‌విష్య‌త్తులో దీనికి త‌గ్గ‌ట్టుగా ఎలాంటి వ్యూహాల‌ను వైసీపీ అమ‌లు చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: