ఏపీలో రాజధాని అంశం పై కీలక ప్రకటన చేసిన జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులు ఉంటాయని చెప్పకనే చెప్పేశారు. ఓవైపు అమరావతి పై తనకు ఎంతమాత్రం వ్యతిరేకత లేదని... తన ఇల్లు కూడా అక్కడే ఉందని చెప్పిన జగన్ .... వైజాగ్ పై తనకు ఉన్న ప్రత్యేకమైన అభిమానం చాటుకున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా వైజాగ్ ఉంద‌న్న జగన్ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే వైజాగ్ బెంగళూరు , చెన్నై , హైదరాబాద్ మహానగరాల తో పోటీపడుతుం ద‌న్న ఆకాంక్ష ను వ్యక్తం చేశారు.

అసలు అమరావతి లో కనీస మౌలిక సౌకర్యాల కల్పన లేదు అని... అక్కడ ఇప్పుడు వాటిని ఏర్పాటు చేయడానికి లక్ష కోట్లు అవుతాయని గత ప్రభుత్వం చెప్పిన విషయాన్ని జగన్ మరోసారి గుర్తు చేశారు. లక్ష కోట్లు ఖర్చు అనేది ఇప్పుడు అని.. అదే పదేళ్ల తర్వాత అది రు. 6 - 7 లక్షల కోట్లకు చేరుకుంటుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కనీస సౌకర్యాలు కల్పించే పరిస్థితి కూడా లేదని... అలాంటి సమయంలో రాజధానిని నిర్మించడం సాధ్యం అవుతుందా ? అని జగన్ ప్రశ్నించారు.

అప్పట్లో చంద్రబాబు రాజధానిని ఎలాంటి ఆలోచ‌న లేకుండా ఏక‌ప‌క్షంగా ఏర్పాటు చేశారని కూడా జగన్ విమర్శించారు జగన్ . వైజాగ్ అభివృద్ధి చేయడంతో పాటు ... కొత్త పరిశ్రమలకు వేదికగా విశాఖను విస్తరించాలనే ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఏపీ కి పూర్తి స్థాయి రాజ‌ధాని గా వైజాగ్ నే చేయాల‌నే ల‌క్ష్య‌మే జ‌గ‌న్ కు ఉంద‌ని కూడా క్లారిటీ వ‌చ్చేసింది.

ఇక అమ‌రావ‌తి పేరుకు మాత్ర‌మే రాజ‌ధాని గా ఉండేలా ఉంది. అక్క‌డ అసెంబ్లీ త‌ప్పా ఏం ఉండేలా లేవు. ఇక పారిశ్రామిక అభివృద్ధి అంతా వైజాగ్ కేంద్రం గానే చేసే ఆలోచ‌న లోనే జ‌గ‌న్ ఉన్న‌ట్టు ఆయ‌న ప‌రోక్షంగా సంకేతాలు అయితే ఇచ్చేశారు. మ‌రి దీనిపై ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి కామెంట్లు వ‌స్తాయో ?  కొద్ది రోజులు వేచి చూస్తే కాని తెలియ‌దు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: