రెండు నెల‌ల ముందు ఏపీ, తెలంగాణ ల మ‌ధ్య నీటి యుద్దం ఓ స్థాయికి చేరుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప‌థ‌కాన్ని అక్ర‌మంగా నిర్మిస్తోంద‌ని విమ‌ర్శ‌లు చేసింది తెలంగాణ ప్ర‌భుత్వం. వ‌రుస పెట్టి మ‌రి ఏపీ ప్ర‌భుత్వంపై తెలంగాణ మంత్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.. అక్ర‌మంగా త‌మకు రావాల్సిన నీటిని దోచుకుంటుంద‌ని ఆరోపించారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రులు కూడా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా అక్ర‌మ ఫ్రాజెక్టులు క‌ట్టింద‌ని వారు ఫైర్ అయ్యారు. అంత‌కు ముందు క‌లిసిమెల‌సి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న‌ట్టుండి నీటి యుద్ధంలో పాల్గొన్నాయి.


కానీ.. ఇదంతా రాజ‌కీయ వ్యూహంలో భాగంగా ల‌బ్ధిపొందేందుకే ఆడుతున్న నాటకం అని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. అస‌లు హుజురాబాద్ బై ఎల‌క్ష‌న్‌ను దృష్టిలో ఉంచుకునే నీటి యుద్ధం పేరుతో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేర్లు చెప్పి సెంటిమెంట్‌ను లేపే ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు వ‌ర‌కు ఇదే అంశంపై హైలెట్ అవుతూ వచ్చింది. ఓట‌మి త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వం కాస్త వెన‌క‌కు త‌గ్గింది. ఇప్పుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్క ద‌గ్గ‌ర క‌లిశారు. తెలంగాణ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి మ‌నవ‌రాలి పెళ్లికి కేసీఆర్, జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు.


    అస‌లు తెలంగాణ ప్ర‌భుత్వం జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తిని నిరాటంకంగా కొన‌సాగించ‌డానికి ప్రాజెక్టుల వ‌ద్ద ఏకంగా పోలీసు ప‌హార పెట్ట‌డం ఉద్రిక్త‌త‌లకు దారి తీసింది. దీంతో ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అలాగే కేసీఆర్ కూడా ప్ర‌ధాని మోడీతో పాటు జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లిసి ఏపీ ప్ర‌భుత్వం నిర్మిస్తున్న రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంతో పాటు కృష్ణా జిల్లాలో రెండు రాష్ట్రాల వాటాల‌పై చ‌ర్చించాల‌ని డిమాండ్ చేశారు. ఆ సంద‌ర్భంలో ఇరు రాష్ట్రాల సీఎం ర‌చ్చ చూస్తే అస‌లు వీళ్లు క‌లుసుకుంటారా అనే అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. ఇప్పుడు ఇద్ద‌రు క‌లిసి క‌బుర్లు చెప్పుకున్నారు. ఇదంతా రాజ‌కీయ వ్యూహంలో భాగం అని వీరిద్ధ‌రి మ‌ధ్య సయోధ్య కుదురింద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: