రాయలసీమ జిల్లాలు అంటే తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు తక్కువ ఉందనే చెప్పొచ్చు. అక్కడ అనంతపురం మినహా మిగిలిన జిల్లాల్లో టీడీపీకి పెద్ద పట్టు లేదు...ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా టీడీపీకి బలం లేదు. అసలు చెప్పాలంటే ఆయా జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచి...రెండు, మూడు దశాబ్దాలు కూడా అయిపోతుంది. అంటే అక్కడ టీడీపీ పరిస్తితి అలా ఉంది...అయితే కోస్తాలో టీడీపీకి కాస్త బలం ఎక్కువే.

కానీ ఇక్కడ కూడా కొన్ని చోట్ల టీడీపీకి కలిసిరాని నియోజకవర్గాలు ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి ఏ మాత్రం కలిసిరాని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది...తాడేపల్లిగూడెం మాత్రమే. ఇక్కడ టీడీపీ గెలిచి 20 ఏళ్ళు దాటేసింది. ఎప్పుడో 1999 ఎన్నికల్లో మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ వరుసగా గెలిచేసింది...మధ్యలో 1987 ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఇలా వరుసగా గెలవడంతో తాడేపల్లిగూడెంలో టీడీపీకి తిరుగులేదనే పరిస్తితి.

కానీ 2004 ఎన్నికల నుంచి సీన్ మారింది...అక్కడ నుంచి టీడీపీ గెలుపు రుచి చూడలేదు. 2004లో కాంగ్రెస్, 2009లో ప్రజారాజ్యం గెలిచాయి...2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుతో బీజేపీ గెలిచింది...అంటే డైరక్ట్‌గా టీడీపీ గెలవలేదు..2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వీటిని బట్టి చూస్తే 1999 ఎన్నికల తర్వాత తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండా ఎగరలేదు.

అయితే వచ్చే ఎన్నికల్లోనైనా తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండా ఎగురుతుందా అనేది డౌటే...ఎందుకంటే అక్కడ జనసేన కూడా బలంగా ఉంది. ఇప్పుడు వైసీపీపై ఉన్న ప్రజావ్యతిరేకత టీడీపీకి కలిసిరావొచ్చు..కానీ జనసేన కూడా ఉండటం వల్ల ఓట్లు చీలిపోతాయి. ఒకవేళ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటే గూడెం సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఒకవేళ జనసేనకి దక్కితే మరోసారి గూడెంలో టీడీపీ జెండా కనిపించదు...లేదంటే టీడీపీకి ఈ సారి ఛాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: