స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఉక్కు కర్మాగారం కార్మికులు 300 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విపక్షాలు కూడా గత కొంత కాలంగా నిరసనలు, ఆందోళనలు బాట పట్టాయి. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర వైఖరిని మారడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వల్లే ఉపయోగం ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. అయితే వైసిపి ఎంపీలు  అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి  డా.భగవత్ కిషన్ రావు ప్రైవేటీకరణ తప్పదంటూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానం గురించి మాకు తెలుసని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణతో పరిశ్రమలోకి మూలధనం పెరిగి  ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు స్పష్టం చేశారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించడం, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, ఉత్తమ మేనేజ్మెంట్ విధానాలు అమలు లోకి రావడం జరుగుతుంది అని అన్నారు. పరిశ్రమలు విస్తరించి ఉత్పత్తి సామర్థ్యం పెరగడం వల్ల  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ విషయానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఉద్యోగులు అంతా నిరసనలు,ఆందోళనలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా ఉద్యోగులు,ఉద్యోగ సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే మొత్తం వారి గుప్పిట్లోకి పోతుందని  వారంటున్నారు.

 స్టీల్ ప్లాంట్ కోసం నిర్వాసితులు, వేలాది మంది రైతులు ప్రాణ త్యాగాలు చేసి  తమ భూములను ఇస్తే దాన్నంతటిని కూడా ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్లాంట్ కు సంబంధించి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని, ఇవన్నీ జరిగితే విశాఖ స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: