ఏపీ రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏ స్టేట్మెంట్ వ‌స్తుంది ఎవ్వ‌రికీ తెలియ‌దు. అందులో కొడాలి నాని అనే మంత్రి చేసే ప‌నులు చెప్పే మాట‌లు అన్నీ కూడా విడ్డూరాలే! అవును! ఆయ‌న‌కు  విశాఖ ప్లాంటు దాని ఆవ‌శ్య‌క‌త ఏమీ తెలియవు అని తేలిపోయింది. అందుకే స్టీల్ ప్లాంటు ఉద్య‌మానికి స‌రిగా అంచ‌నావేయ‌కుండా సంబంధం లేని ప్ర‌క‌ట‌నల‌కు కార‌ణం అవుతున్నారు. వివాదాల్లోకి త‌న‌ని తాను ఇరికించుకుంటున్నారు. అస‌లు ప్లాంటు ప‌రిర‌క్ష‌ణ‌కు వైసీపీ ఇప్ప‌టిదాకా చేసిందేంట‌ని?

రెండు స్థానిక ప్ర‌భుత్వాలు అవి కూడా విశాఖ‌కు చెందిన వైసీపీకి చెందిన రెండు స్థానిక ప్ర‌భుత్వాలు మాత్రం చొర‌వ చూపి స్టీలు ప్లాంటు ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపాల‌ని తీర్మానాలు చెప్పాయి. ఆ విధంగా విశాఖ జెడ్పీ కార్య‌వ‌ర్గం, అదేవిధంగా జీవీఎంసీ కూడా త‌మ ప‌రిధిలో చేయాల‌నుకున్న‌దేదో చేశాయి. వీటికి కేంద్రం ఏ విధంగా మ‌ద్ద‌తుగా ఉంటుందో అన్న‌విష‌య‌మై మాట్లాడ‌కుండా త‌మ  వ్యూహాల‌కు సంబంధించి నానీ మాట్లాడ‌డం అది కూడా ఉద్య‌మ స్ఫూర్తిని నీరుగార్చి, ప్లాంటుకు మ‌ద్ద‌తుగా మాట్లాడేవారిని కించ‌ప‌ర‌చ‌డం కూడా భావ్యం కాదు. ఆ విధంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేయ‌డం స‌రిగా లేదు. స‌రికాదు కూడా!

ఈ త‌రుణంలో ఈ నేపథ్యంలో
విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ ఎప్పటి నుంచో నినాదం ఉంది. ఆ నినాదానికి అనుగుణంగానే ఉద్య‌మం న‌డుస్తోంది. కానీ కొడాలి నాని చెప్పిన ప్ర‌కారం విశాఖ ఉక్కు విష‌య‌మై త‌మ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ (బీహారు కు చెందిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌) చూసుకుంటార‌ని చెప్ప‌డ‌మే విడ్డూరంగా ఉంది. ఎంద‌రో బ‌లిదానాల త‌రువాత ఆంధ్రుల‌కు ద‌క్కిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అన్న‌ది ఇప్పుడు ప్ర‌యివేటీక‌ర‌ణ అయిపోతుంద‌ని, అందుకే దీనిని అడ్డుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని , కేంద్రం తీసుకున్న నిర్ణ‌యా న్ని త‌క్ష‌ణం వ్య‌తిరేకించి, ప్లాంటును కాపాడుకోవాల్సిన అవ‌స‌రం గుర్తించాల‌ని సంబంధిత సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. కానీ ప్లాంటుకు సంబంధించి ప‌వ‌న్ కల్యాణ్ మాట్లాడ‌గానే మంత్రి కొడాలి నాని సీన్ లోకి వ‌చ్చి ఓ వింత వాద‌న వినిపించ‌డం విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి: