"నాట‌కీయ ధోర‌ణిలో మాట్లాడడంలో నేర్ప‌రి మంత్రి అనీల్. ఈ విద్యను ఎక్క‌డో నేర్చుకుని ఉంటారు. లేదంటే వైసీపీ టీంలో ఎవ్వ‌ర‌యినా ఈయ‌న‌కు శిక్ష‌ణ ఇచ్చి ఉండ‌వ‌చ్చు. అందుకే స‌జ్జ‌ల క‌న్నా సుబ్బారెడ్డి కన్నా బాగా మాట్లాడ‌డంలో అనీల్ కు నాలుగు మార్కులు ఎక్కువే వేసి, ఎప్ప‌టిక‌ప్పుడు జ‌గ‌న్ స్వీట్లు తినిపిస్తూనే ఉంటారు...ఏంటో ఆయ‌న ఏ సినిమా డైలాగ్ రైట‌ర్ కూడా రాయలేనంత గొప్ప ప‌రిజ్ఞానంతో మాట‌లు రాసి,మీడియాకు వినిపించి త‌రువాత జ‌న‌సేన‌తో ట్రోల్ చేయించుకుంటారు. ఎందుకంటే ఆయ‌న‌కు అదొక సర‌దా! ఇంకా చెప్పాలంటే తుత్తి కావొచ్చు" అని అంటున్నారు టీడీపీ నాయ‌కులు కూడా!

 
ఈ వారం చాలా త‌గాదాలు న‌డిచాయి
అగాధాలు సృష్టించాయి..ఎప్ప‌టిలానే
రోలింగ్ స్టార్ రోరింగ్ స్టార్ మంత్రి అనీల్
కావ‌డ‌మే ఈ క‌థ‌లో అంద‌రికీ తెలిసిన
ట్విస్టు.....



మంత్రి అనీల్ కు న‌ట‌న అంటే చాలా ఇష్టం..కొడాలి నానికి సినిమాలు తీయ‌డం అంటే చాలా ఇష్టం ..ఆ వ్యాపారంతోనే కొడాలి నాని చాలా సంపాదించుకున్నారు తోటి ఎమ్మెల్యే, మిత్రుడు వల్ల‌భ‌నేని వంశీతో!విడ్డూరం ఏంటంటే వీళ్లంతా ఐదు రూపాయ‌ల‌కే సినిమా చూపించాలి అని జ‌గ‌న్ చెబుతున్న మాట‌కు ఎదురు చెప్ప‌క‌పోగా, ప‌వ‌న్ ను ఈ వారం బాగా టార్గెట్ చేసి స్వామి భ‌క్తి బాగానే ప్ర‌ద‌ర్శించారు. త‌ద్వారా యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎప్ప‌టిలానే మార్కులు కొట్టేశారు.

శ్యామ్ సింగ రాయ్ సినిమా విడుద‌లయింది. అన్నింటా మంచి పేరే తెచ్చుకుంది. కొన్ని లాజిక్ ల‌కు ప‌ని చెప్ప‌కుండా సినిమా చూడ‌గ‌లిగితే ఈ సినిమా అంద‌రికీ చేరువ అయి తీరుతుంద‌ని సినిమా అభిమానులు చెబుతున్న మాట. అయితే ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా హీరో నానీ ఏర్పాటు చేసిన మీడియా మీట్లో కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేసి మ‌న గౌర‌వ ఆంధ్రావ‌ని మంత్రుల‌తో నానా మాట‌లూ ప‌డ్డారు. నానీ ఎవ్వ‌రో నాకు తెలియ‌దు అని త‌న‌కు కొడాలి నాని త‌ప్ప ఇంకేం నానీ త‌న‌కు తెలియ‌ద‌ని చాలా డిప్ల‌మాటిక్ ఆన్స‌ర్ ఒక‌టి ఇచ్చివెళ్లారు అనీల్.. బాగుంది ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ను ఉద్దేశించి కూడా కొన్ని మాటలు అన్నారు. ప‌వ‌న్ కు తాను కూడా ఒక‌ప్ప‌టి అభిమానినే అని చెప్పి, ప‌వ‌న్ త‌న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నాడ‌ని విమ‌ర్శించారుమంత్రి అనీల్. దీంతో జ‌న‌సేన అభిమానులు అనీల్ ను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాదు ఆయ‌న గతంలో చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా వెలుగులోకి తెచ్చారు.ఈ సంద‌ర్భంగా బెట్టింగ్ బంగార్రాజు పేరిట ఓ వ‌ర్డ్ ను ట్రోల్ చేశారు కూడా!ఇంత‌కూ ఏపీ క్యాబినెట్ లో బెట్టింగ్ బంగార్రాజు ఎవ్వ‌రో?

మరింత సమాచారం తెలుసుకోండి: