పార్టీపార్టీ అనేది లేదు...కర్నూలు జిల్లాలో మాత్రం ఏ పార్టీలోనైనా రెడ్డి వర్గం నేతలదే హవా అని చెప్పొచ్చు. జిల్లా మొత్తం రెడ్డి వర్గం చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ 14 సీట్లు ఉండగా దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో రెడ్డి వర్గం నేతల హవా ఉంటుంది. ఎస్సీ స్థానాల్లో కూడా రెడ్డి నేతల డామినేషన్ ఉంటుంది. అయితే గత ఎన్నికల్లో 14 సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అందులో 9 మంది రెడ్డి ఎమ్మెల్యేలే. అంటే రెడ్డి నేతల హవా ఏ రేంజ్‌లో ఉందో చెప్పొచ్చు. అస‌లు ఏ పార్టీ అయినా ఆ జిల్లాలో రెడ్డి వ‌ర్గం వారిని ముందుగా సంతృప్త ప‌ర‌చ‌క పోతే ఆ పార్టీకి ఇక్క‌డ ఇబ్బందే..!

వైసీపీలోనే కాదు టీడీపీలో కూడా రెడ్డి నేతలు ఉన్నారు. 9 నియోజకవర్గాల్లో రెడ్డి నేతలే టీడీపీ బాధ్యతలు చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ రెడ్డి నేతలు చిత్తుగా ఓడిపోయారు. కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో టీడీపీ రెడ్డి నేతలు ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో రెడ్డి నేతలు పనిచేస్తున్నారో ఒకసారి చూస్తే..బనగానపల్లెలో బీసీ జనార్ధన్ రెడ్డి, మంత్రాలయంలో తిక్కారెడ్డి, శ్రీశైలంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి, పాణ్యంలో గౌరు చరితా రెడ్డి, ఆలూరులో కోట్ల సుజాతమ్మ, ఎమ్మిగనూరులో జయనాగేశ్వర్ రెడ్డి, డోన్‌లో సుబ్బారెడ్డి నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియలు ఉన్నారు.

అలాగే నంద్యాల పార్లమెంట్‌లో మాండ్ర శివానందరెడ్డి, కర్నూలు పార్లమెంట్‌లో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు. అంటే కర్నూలు జిల్లా టీడీపీలో రెడ్డి నేతలదే హవా అని చెప్పొచ్చు. అయితే గత ఎన్నికల్లో వీరు చిత్తుగా ఓడిపోయారు. కానీ ఈ సారి మాత్రం గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. కాకపోతే వీరిలో  కొందరు మాత్రమే పికప్ అయ్యారని చెప్పొచ్చు. బీసీ జనార్ధన్ రెడ్డి, కోట్ల సుజాతమ్మ, తిక్కారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు కాస్త పుంజుకున్నారు. ఇక మిగిలిన నేతలు కూడా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లోపు వారు పుంజుకుంటారేమో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: