తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన ఒక ఘటన రాష్ట్రమంతా కలకలం రేపుతోంది. వైసీపీ కి చెందిన నాయకుడు మరియు తిరుపతి గంగమ్మ దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ పార్థసారధి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనితో కుప్పంలో ఒక్కసారిగా రాజకీయ నాయకులు మరియు ప్రజలు ఉలిక్కిపడ్డారు. అయితే ఇతని ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఏమిటన్నది ఇపుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే అసలు ఏమి జరిగిందో ఒకేసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అయితే పార్థసారధి తన ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విషయం అంతా బట్టబయలు అయింది. అది కూడా తిరుపతి గంగమ్మ దేవస్థానం కొత్త చైర్మన్ మంజునాధ్ ప్రమాణస్వీకారం రోజునే మాజీ చైర్మన్ పార్థసారధి ఆత్మహత్య చేసుకోవడంతో పరిస్థితి ఎంత సీరియస్ అనేది అందరికీ అర్ధమవుతోంది. అయితే దీనికంతటికీ కారణం ఆ చైర్మన్ పదవి అని ఈ వీడియో ద్వారా క్లియర్ గా తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలుగా పార్థసారధి చైర్మన్ గా పనిచేస్తూ వచ్చాడు. అయితే రానున్న మరో రెండు సంవత్సరాలు కూడా పార్థసారధిని చైర్మన్ గా కొనసాగిస్తారని ఇతను ఫిక్స్ అయిపోయాడు. దీనికి స్థానిక వైసీపీ నేతలు కూడా హామీ ఇచ్చారట.

అయితే ఏమైందో ఏమో తెలియదు. కానీ స్థానిక వైసీపీ నేతలు తనకు ఇచ్చిన మాట తప్పారని పార్థసారధి ఆ వీడియోల్లో పూసగుచ్చినట్లు తెలిపాడు. అంతే కాకుండా ఇటీవలే వైసీపీలోకి వచ్చిన వ్యక్తిని కొత్త చైర్మన్ గా ప్రకటించారని తన ఆవేదనను వెళ్లబుచ్చాడు. ఈ కారణంగానే నాకు చాలా బాధ కలిగిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. ఈ చైర్మన్ పదవి తనకు వస్తుందని గంగమ్మ గుడి కోసం 35 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా పార్థసారధి తెలిపాడు. ఇప్పుడు ఆర్ధికంగా నా కుటుంబం ఇబ్బందుల్లో పడిందని వాపోయాడు. గత ఏడు సంవత్సరాల నుండి వైసీపీ అభివృద్ధి కోసం నా శాయశక్తులా కష్టపడ్డానని అయినా ఇలా నన్ను నమ్మబలికించి మోసం చేశారని ఆ వీడియో ద్వారా తెలిపాడు. నన్ను జాతర పూర్తి అయ్యే వరకు అయినా చైర్మన్ గా కొనసాగించాలని ప్రాధేయపడినా వినిపించుకోకుండా తీసేశారని తనబాధను చెప్పుకున్నారు పార్ధసారధి. ప్రస్తుతం ఈ వీడియోను ఆధారంగా చేసుకుని పార్థసారధి బంధువులు న్యాయం చేయాలనీ పోలీసులను కోరుతున్నారు. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: