అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అవసరమైతే తమని బాధపెడుతున్న అధికార వైసీపీకి ఉరివేయాలని చెప్పారు. రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చిన బాబు, ఇక ముందు ముందు అన్నీ మంచి రోజులేనని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జిల్లా నెక్కలం గొల్లగూడెం గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు చంద్రబాబు. అక్కడే సహపంక్తి భోజనం చేశారు. రైతులంతా టీడీపీకి అండగా నిలబడాలన్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం రైతులకోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. రైతు భరోసా అందిస్తోంది. వ్యవసాయానికి అవసరమయ్యే పనిముట్లను ఉచితంగా అందిస్తోంది. బోర్లు వేయిస్తోంది. గిట్టుబాటు ధర విషయంలో కూడా స్ట్రిక్ట్ గా ఉంటోంది. అయితే అక్కడక్కడా రైతులు ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే. కానీ రైతులు మరీ వన్ సైడ్ గా టీడీపీవైపు మారిపోతారా లేదా అనేది మాత్రం ప్రశ్నార్థకం.

గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ అనే హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ అనేది బాగా వర్కవుట్ అయింది. రైతుల రుణాలను నేను మాఫీ చేయలేను అని నేరుగా జగన్ చెప్పేయడంతో రైతులంతా చంద్రబాబు వైపు మళ్లారు. టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడింది. అయితే రుణమాఫీపై రకరకాల కొర్రీలతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత చంద్రబాబు మాటలు ఎవరూ వినలేదు. 2019 ఎన్నికల్లో అంతా బదులు తీర్చుకున్నారు. ఫలితం 151 సీట్ల బారీ మెజార్టీతో వైసీపీ విజయం.

మరి ఇప్పుడు కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయా అంటే ప్రశ్నార్థకం. ఒకరకంగా రైతులంతా మూకుమ్మడిగా వైసీపీకి వ్యతిరేకంగా ఏమీ లేరు. పార్టీల వారీగా విడిపోవచ్చు కానీ, సామాన్య రైతు తనకి అందుతున్న ఆర్థిక భరోసాతో కాస్త సంతోషంగానే ఉన్నారు. దీనితోపాటు గిట్టుబాటు ధర కూడా పకడ్బందీగా అమలైతే వారికి ఇక ఏ దిగులూ ఉండకూడదు. 2024నాటికి రైతులు ఎవరి పక్షాన ఉంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: