ఏపీ రాజకీయాలలో సంచలన వార్తలు బయటకు వస్తున్నాయి. 2024 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ మరియు టీడీపీ కూటముల మధ్యన హోరా హోరీ పోరు తప్పదని క్లియర్ గా అర్ధమవుతోంది. అందుకే ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలకు సమానమైన విజయావకాశాలు కలిగి ఉన్నాయని రాజకీయ ప్రముఖులు భావిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఒక విషయం మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అలీ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ మధ్యన సినీ ప్రముఖులు సైతం రాజకీయాలపై మక్కువతో ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఉనికిని చాటుకుంటున్నారు.

ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, మురళీమోహన్, పోసాని కృష్ణమురళి, పృథ్వి తదితరులు రాజకీయాలవైపు వచ్చినవారే. ఇక 2019 ఎన్నికల సమయంలో అలీ వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. కానీ అలీ ప్రచార బాట పట్టిన చోట్ల వైసీపీ ఓటమి చెందడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా ఇప్పుడు సోషల్ మీడియా విభగానికి ప్రతినిధిగా ఉన్న అలీ చేసిన కామెంట్ పట్ల విభిన్న అభిప్రాయాలూ వెలువడుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే... వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తాను అనడంతో పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం, పిఠాపురం, అనంతపురం అర్బన్ లలో ఒక ప్లేస్ నుండి పోటీ చేస్తాడు. అలా చూసుకుంటే అలీ వీటిలో ఒక నియోజకవర్గంలో అలీ పోటీ చెయ్యాలి. కానీ ఇందుకు సీఎం జగన్ ఏ మేరకు అంగీకరిస్తాడు అన్నది చూడాలి. అసలు ఏ విధంగా ఈ విషయం బయటకు వచ్చింది ? అలీ అన్నాడా ? లేదా జగన్ అలా నెలా చేశాడా ? లేదా మరేదైనా కోణం ఉందా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.    

మరింత సమాచారం తెలుసుకోండి: