ఎన్నికలు దగ్గరికొస్తున్న కొద్దీ గ్రేటర్ లో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.. అధికార , ప్రతిపక్ష పార్టీ లు ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి ప్రచారానికి సిద్ధమైంది... ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న కేసీఆర్ కి దుబ్బాక ఉప ఎన్నిక బ్రేక్ వేసింది.. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా విజయం సాధించి టీ ఆర్ ఎస్ కి పెద్ద షాక్ ఇచ్చింది.. ముందు నుంచి ఇక్కడ గులాబీ పార్టీ దే విజయం అనుకున్నారు అంతా కానీ ఎప్పుడైతే రఘు నందన్ రెడ్డి ని టీ ఆర్ ఎస్ పార్ట్ హైలైట్ చేసిందో అప్పుడే ప్రజలోకి అయన మరింత దూసుకుపోయారు.. అంతేకాదు మూడో సారి కూడా అదే నేత నిలబడడంతో ఆయనకు సింపతీ కూడా వర్క్ అవుట్ అయ్యింది. రెండు సార్లు ఓడించిన ప్రజలు ఈ సరి ఆయనకు అవకాశం ఇచ్చారు..