హోరాహోరీగా జరిగిన జంగమ్మెట్ డివిజన్ ఎన్నికలలో మజ్లీస్ పార్టీ మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసింది. గెలిచేంత బలం లేకపోయినప్పటికీ ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులుండడంతో మజ్లీస్ పార్టీకి విజయం సులభతరమయ్యింది. 46,211 ఓట్లున్న ఈ డివిజన్లో 53.03 శాతం పోలింగ్‌తో 24,835 ఓట్లు నమోదయ్యాయి.