కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక ఇక్కడ టీడీపీకి ఓటములు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే కొడాలి నాని ఎంట్రీతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కొడాలి నాని టీడీపీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చి సొంత ఇమేజ్ తెచ్చుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన నాని, తర్వాత టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇప్పుడు మంత్రి కూడా అయ్యి దూసుకెళుతున్నారు.