ఈ రోజు వేసుకున్న డ్రెస్.. రేపు మళ్లీ వేసుకోవటం అంటే నూటికి తొంభైశాతం మందికి ఇష్టముండదు. ఇక నేటి సమాజంలో రోజుకో డ్రెస్లాగా.. వేసిన డ్రెస్ మళ్లీ వేయకుండా నెల రోజులు కలర్ఫుల్గా బ్రతికేవారూ ఉన్నారు. ఇక మనిషి ధరించే డ్రెస్ ను బట్టి ఆ వ్యక్తికి గౌరవం కూడా రెట్టింపు అవుతుంది.అమెరికాకు చెందిన ఓ మహిళ విభిన్నమైన చాలెంజ్ ను ఎంచుకున్నారు. 100 రోజులుగా సేమ్ డ్రెస్ వేసుకున్నారు. ఫ్యాషన్ గురించి కొత్త చర్చ రేపారు.