రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం కంటే ఏమాత్రం తీసిపోవట్లేదని ఓ హామీ విషయంలో రుజువు అయ్యింది.. చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు బాగానే అమలు చేస్తున్నా అందులో లోటుపాట్లు కోకొల్లలు.. మళ్ళీ ప్రజలకు మాత్రం తొంభై శాతం సంక్షేమ పథకాలు అమలుచేశాం.. తొంభై ఐదు శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు.. మాట తప్పడు మడిమ తిప్పడు అనే నినాదంతో వైసీపీ జగన్ ను విపరీతంగా ప్రచారం చేస్తుంది.. ఇప్పటివరకు ఇచ్చిన మాట అయితే తప్పలేదు కానీ జగన్ ఇచ్చిన మాటను తిప్పుతున్నాడు..