ఈ మధ్య కాలంలో ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా అదే తరుణంలో ఏపీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. చేయని తప్పునకు ఇద్దరు దళితులు దాడులకు గురయ్యారు. కోళ్లు దొంగిలించారనే ఆరోపణతో వారిద్దరినీ చెట్టుకు కట్టేసి.. ఆపై ఇష్టారీతినా గొడ్డును బాధిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము దొంగతనం చేయలేదని చెబుతున్నా వినకుండా కొంత మంది వారి చుట్టూ గుమి గూడి ఈ దారుణానికి ఒడిగట్టారు.