రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వంపై విమర్శలు చేసి తానే అడ్డంగా బుక్కయ్యాడు. విషయానికొస్తే.. వీర్రాజుకాండ్రపాడు గ్రామంలో గురువారం బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వచ్చి ప్రభుత్వంపై విమర్శలు చేశారు సోము వీర్రాజు. బీజేపీ కార్యాలయానికి ఇల్లు అద్దెకు ఇచ్చినందుకు ఆ ఇంటి యజమాని పెన్షన్ తొలగించారంటూ ఆరోపించారు. అయితే సోము వీర్రాజు ఆరోపణలో నిజం లేదని ఇంటి యజమాని రాయల బుల్లి తెలిపారు. ''నెల రోజుల కోసమని ఇళ్ళు తీసుకొని ఎనిమిది నెలలైనా బీజేపీ నేతలు ఖాళీ చేయలేదు.నాకు ఇబ్బందిగా ఉంది ఖాళీ చేయమని చెప్పాను. దాంతో రాజకీయ స్వలాభం కోసం నా పెన్షన్‌కు ముడిపెట్టి ఆరోపణలు చేయటం తాను తీసుకున్న గోతిలో తానే పడటం ఇదే అంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఎద్దేవా చేశారు..