కడప జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఆదివారం నామినేషన్ల స్వీకరణ ఘట్టం పూర్తయింది. ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల పరిధిలోని 206 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి 5742 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సర్పంచి 1477, వార్డు సభ్యుడి స్థానాలకు 4265 ఉన్నాయి. ఆదివారం సర్పంచి 788, వార్డు సభ్యుడి స్థానాలకు 2878 నామినేషన్లు దాఖలయ్యాయి..నామినేషన్ల స్వీకరణ ముగింపు సమయానికి అయిదు గ్రామ పంచాయతీల్లో ఒకే అభ్యర్థి చొప్పున పోటీలో నిలిచారు. దీంతో చాపాడు మండలం సీతారామపురం, దువ్వూరు మండలం పెద్దజొన్నవరం, ఎర్రబల్లె, సంజీవరెడ్డిపల్లె, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామ పంచాయతీలకు సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అవటానికి మార్గం సుగమమైంది.